విలాసవంత జీవనం.. మాదక ద్రవ్యాలంటే మహా ఇష్టం.. అడ్డేదీ లేదనుకుంది.. సరిగ్గా ఇదే సమయంలో డ్రగ్స్ సేవిస్తూ తండ్రి కంటపడింది. వద్దని వారించాడు. ఆమె విలాసాలకు అడ్డుతగిలాడు. అంతే.. జన్మనిచ్చిన తండ్రినే సజీవ దహనం చేసిందా తనయ. వినడానికే భయానకంగా ఉన్న ఘటన కర్ణాటకలో జరిగింది.
బెంగళూరు రాజాజీనగర్‌లో ఉంటారు వస్త్రవ్యాపారి జయకుమార్. భాష్యం సర్కిల్లోని తన నివాసం ఐదో అంతస్తులో విగతజీవిగా పడి ఉన్నారు. కూతురు ఉన్నతి స్వల్పంగా కాలిన గాయాలతో పడి ఉంది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఘటనా సమయంలో జయకుమార్ భార్య.. వేరే పని నిమిత్తం పాండిచ్చేరిలో ఉన్నారు.
ఇదీ చూడండి: ముళ్ల పొదల్లో శిశువు- ఈ పాపం ఎవరిది..?
నిప్పంటించిందా..?
ఆగస్టు 17న రాత్రి తన కూతురు డ్రగ్స్ సేవించిందన్న కారణంతో.. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని జయకుమార్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కోపోద్రిక్తురాలైన ఉన్నతి... తండ్రి పడుకున్న సమయంలో నిప్పంటించినట్లు అనుమానిస్తున్నారు. మంటలు అంటుకుని ఆమెకూ స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. పోలీసులు... కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: బాలింతను ఈడ్చుకెళ్లిన ఆశ్రమ నిర్వాహకులు