ETV Bharat / bharat

కరోనాపై విజయం సాధిస్తే ఇక నిత్యం ఉగాదే!

ఏదో ఒక దేవుడి పుట్టిన రోజో, ఏదైన విజయానికి ప్రతీకగానో మన పండగలన్నీ జరుపుకుంటాము. ప్రతి పండగ వెనకాలా ఓ చరిత్ర ఉంటుంది. అలాంటిదేమీ లేని పండగల్లో ఉగాది ఒకటి. ఒక్కో ఏడాది మనకు ఒక్కో గుర్తు మిగిల్చి ఒక్కో పాఠం నేర్పించి వెళ్తుంది. దాన్నే అనుభవం అంటారు. అది రాజకీయం కావచ్చు, మంచీ, చెడూ కావచ్చు. భీష్మ పితామహుడిలాగే మనమూ అనేకానేక యుద్ధాలు చేస్తున్నాం, చేస్తాం!

author img

By

Published : Mar 25, 2020, 9:51 AM IST

A analysis story on Winning over Corona is a must!
కరోనాపై గెలిస్తే నిత్యం ఉగాదే!

ఒక్కో ఏడాది మనకు ఒక్కో గుర్తు మిగిల్చి ఒక్కో పాఠం నేర్పించి వెళ్తుంది. దాన్నే అనుభవం అంటారు. అది రాజకీయం కావచ్చు, మంచీ కావచ్చు, చెడూ కావచ్చు. మహాభారతంలో భీష్ముడి గురించి చెబుతూ 'అతడనేక యుద్ధములందు ఆరితేరిన ఘనుడు' అంటారు. ప్రతి యుద్ధం ఒక జీవితానుభవం. భీష్మ పితామహుడిలాగే మనమూ అనేకానేక యుద్ధాలు చేస్తున్నాం, చేస్తాం!

ఈ కరోనా వైరస్‌, అలియాస్‌ కొవిడ్‌-19ను గతించిన వికారినామ సంవత్సరం ఖాతాలో రాసేద్దాం. ఆ ఏడాది పేరే అలా ఉంది మనం చేసేదేముంది. ప్రపంచం దీన్ని 2019వ సంవత్సరం ఖాతాలో జమ చేసింది. వ్యంగ్యంగా చెప్పినా, తాత్వికంగా చెప్పినా జీవితం మాత్రం రాజకీయాల్లాగే ఉగాది పచ్చడి లాంటిది. షడ్రుచుల సమ్మేళనం.

అందులో ఉగాది ఒకటి!

ఏదో ఒక దేవుడి పుట్టిన రోజో, ఏదో ఒక విజయానికి ప్రతీకగానో మన పండగలన్నీ ఉంటాయి. ప్రతి పండగ వెనకాలా ఒక చరిత్ర ఉంటుంది. అలాంటిదేమీ లేని పండగల్లో ఉగాది ఒకటి. కొత్త సంవత్సరానికిది నాంది. మనం దీనికో చరిత్ర రాద్దాం. కరోనానుతరిమేసే పండగ్గా దీన్ని జరుపుకొందాం. కాలకూట విషాన్ని, హాలాహలాన్ని భక్షించిన మనం కరోనాను అంతం చేయడం పెద్ద లెక్కలోనిది కాదు.

నాయకులకు ఏవీ పట్టవు!

కరోనాను మన పాలిటిక్సు లెక్క చేస్తున్నాయా చెప్పండి. వాటి దారి వాటిదే. 'నైనం ఛిందంతి శస్త్రాణి...' అని గీతకారుడు ఆత్మ గురించి సెలవిచ్చినట్లు రాజకీయాలకు ఇవేవీ అంటవు. మన కళ్లముందే మధ్యప్రదేశ్‌లో టోకున పార్టీ ఫిరాయింపులు జరిగి, ప్రభుత్వం కూలిపోయి, కొత్త ప్రభుత్వం చడీచప్పుడూ లేకుండా నెలవయిందా లేదా! దాన్ని ఇవేమైనా ఆపగలిగాయా. వెనకటికి పీవీ నరసింహారావు ‘చట్టం తన పని తాను చేసుకుపోతుంది’ అన్నారు. అది చట్టం విషయంకంటే రాజకీయాలకు బాగా సరిపోతుంది. ఏదేమైనా రాజకీయం తన పని తాను చేసుకుపోతుంది. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు ఇది మస్తు ఉగాది. మనం రాజకీయులం కాదు- మామూలు మనుషులం.

ఉగాది అంటే పచ్చడి, పంచాంగ శ్రవణం, పిండివంటలు, తోరణాలు, కొత్తబట్టలూ, బంధువులూ... వగైరాలని మనకు తెలుసు. మరిప్పుడవన్నీ చేయగలమా, లేక 'నాకుగాదులు లేవు, నాకుషస్సులు లేవు...' అని కృష్ణశాస్త్రిలా పాడుకుని ఊరుకుందామా. లేదా పాలిటిక్సులా, చట్టంలా మన పండగ మనం చేసుకుపోదామా. సరిగ్గా రెండింటి మధ్య గీత లాగున్నాం మనమిప్పుడు. మహాభారతంలో బలరాముడు ఎటువైపూ కాదని తప్పించుకుని తీర్థయాత్రలకెళ్లాడు, సాత్యకి పార్టీ మార్చి పాండవులతో చేరాడు.

నలుగురితో నారాయణా!

నలుగురితో నారాయణా అన్నారు పెద్దలు. అంతా ఇళ్లల్లోనే ఉండిపోయి, చుట్టాలెవరూ రాలేని పరిస్థితి ఉండి, సంతోషాన్ని భయం ఆవహించినప్పుడు- పచ్చడి రుచిస్తుందా!

'కంటికి నిద్రవచ్చునే, వంటకమబ్బునే...' అని శ్రీనాథ మహాకవి (కంటకమైన క్షాత్రవుడు డిండిమభట్టు గురించి) అన్నట్లు, పండగలో ఆనందం మిగులుతుందా? ఏమో అటూ ఇటూ కాని సంకట సందిగ్ధ పరిస్థితి. 'వీ షల్‌ ఓవర్‌కం' అని అంతర్జాతీయ గీతం ఒకటుంది. మనమీ ఉగాది సాక్షిగా కరోనాను జయిస్తాం. పంచాంగం సాక్షిగా కరోనా పంచాంగం సాంతం బయటపెడతాం, కరోనాకు ఈ ఏడాది సాక్షిగా రౌరవాది నరకాలను చూపెడతాం. ఇది నిత్యం ఇది సత్యం.

కొత్త పంచాంగం

కొత్త పంచాంగం చూశారా, కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు అని లేదూ... పిల్లా పాపా, పెద్దా చిన్నా; పొద్దున లేవగానే హడావుడిగా ఆఫీసు వెళ్లే భర్తలు, భార్యలు, బడికి వెళ్లే పిల్లలు, సందడి సందడిగా ఇంట్లోనే ఉన్నారు. ఇంతకన్నా ఉగాది ఏముంటుంది? పండగా ఆనందం అనేది హృదయంలో ఉంటుంది. శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు ఉన్నంత ఆనందపుటుగాది పదవినుంచి దిగిపోయిన కమల్‌నాథ్‌కు ఉంటుందా? వ్యత్యాసం లేదూ... ఉంటుంది. ఒకానొక కొత్త ఉగాది పంచాంగంలో ఏముందంటే- కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు, ఈ ఏడాది వడదెబ్బలు ఉండవు, కులమత వర్గ ప్రాంత, భాషా భేదాలను మనసారా మరిచిపోయి అంతా ఒకటై అందరూ యుద్ధవీరుల్లా పోరాడుతారు. విజయం లభిస్తుంది. వ్యక్తులమధ్య దూరం పెరిగినా కూడా సాన్నిహిత్యం ఏర్పడుతుంది. మనుషులమధ్య ఆప్యాయతలు ఇనుమడిస్తాయి. శ్రమ తగ్గుతుంది. ఒత్తిడి ఉండదు. ఒళ్లు చేసే అవకాశాలున్నాయి. ఇంట్లోనే ఉన్నప్పుడు (అదీ వాకింగ్‌ లేకుండా ఉన్నప్పుడు) కాస్త ఎక్కువే లాగిస్తామా లేదా? లేకున్నా శ్రీవారికి శ్రీమతి, శ్రీమతికి శ్రీవారూ ప్రేమతో మరికాస్త వడ్డిస్తారు. పగటికేమైనా చేసిపెడతారు. ఆఫీసులో అదేం ఉండదుగా. ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయి కనుక జాగ్రత్త వహించండి...'

దేనిలోనైనా కొంత మంచి ఉంటుంది. అది గ్రహిస్తే చాలు. పండగా పబ్బం అన్నీ మన మదిలో ఉంటాయి. కరోనా వైరస్‌ చచ్చిందంటే మనకిక రోజూ కొంగొత్త ఉగాదే. నరకాసురుణ్ని సత్యభామ సంహరించాక దీపావళి పండగ చేసుకున్నట్లుగానే మనమూ కొత్తకొత్త ఉగాదులెన్నో చేసుకుందాం. కవి సమ్మేళనాలు, కోకిలపాటలు, పచ్చడి, పంచాంగం... ఈ ఉగాదితో కరోనా నామసంవత్సరానికి అంతం పాడి- ఆయురారోగ్యమస్తు... లోకః సమస్త సుఖినోభవంతు అని కొత్త సంవత్సరంలోకి వెళ్దాం!

-చికిత

ఇదీ చూడండి: ఆ ట్వీట్​కు ఒక గంటలోనే 52వేల లైక్​లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.