ETV Bharat / bharat

తొమ్మిదేళ్ల బాలికపై పక్కింటి యువకుడి అత్యాచారం - rapes after hathras

'హాథ్రస్' ఆగ్రహ జ్వాలలు ఇంకా చల్లారకముందే కొత్త దారుణాలు బయటపడుతున్నాయి. తాజాగా మరో రెండు అత్యాచార ఘటనలు వెలుగులోకి వచ్చాయి. యూపీలో తొమ్మిదేళ్ల బాలిక, దిల్లీలో ఎస్సీ మహిళ లైంగిక దాడులకు గురయ్యారు.

a 9 years girl was raped by a neighbour in uttarpradesh and a dalith woman was raped in delhi
తొమ్మిదేళ్ల బాలికపై పక్కింటి యువకుడు అత్యాచారం
author img

By

Published : Oct 15, 2020, 4:15 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో మరో దారుణం బయటపడింది. తొమ్మిదేళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. బాందా జిల్లాలోని బిసాందా పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఓ గ్రామంలో బుధవారం ఈ ఘాతుకం జరిగింది.

పొరుగింటి యువకుడే..

బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండగా.. పొరుగింటి యువకుడు ఆమెపై కన్నేశాడు. అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి సాయంత్రం ఇంటికి వచ్చాక విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటనలో సంశుద్దిన్​(22) అనే యువకుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు. బాధిత బాలికను వైద్య పరీక్షల కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

దళిత మహిళపై అత్యాచారం..

దిల్లీలో అమానుష ఘటన వెలుగుచూసింది. 21 ఏళ్ల ఎస్సీ మహిళ సామూహిక అత్యాచారానికి గురైంది. మవురానిపుర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది.

గ్రామంలోని ప్రైవేట్​ పాఠశాలకు రమ్మని ఓ వ్యక్తి పిలవగా.. బాధితురాలు వెళ్లిందని పోలీసులు తెలిపారు. బుధవారం సాయంత్రం ఆమెపై నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారని వెల్లడించారు. నిందితులను నరేంద్రసాహు, సాక్షమ్ సిరోతియాగా గుర్తించారు. వారిలో ఒకరు అదే పాఠశాల మేనేజర్​ కాగా, మరొకరు అతని స్నేహితుడు. ఆ ఇద్దరిపై ఎస్సీ ఎస్టీ చట్టం సహా సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి:బాలికపై 22 రోజులపాటు సామూహిక అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.