ETV Bharat / bharat

నిజాముద్దీన్​ ప్రార్థనల్లో పాల్గొన్న విదేశీయుల వీసాలు రద్దు - corona virus in india latest news

దిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్​ తబ్లీగీ జమాత్​ ప్రార్థనల్లో పాల్గొన్న విదేశీయుల వీసాలను రద్దు చేసింది కేంద్రం. 960 మంది పాస్​పోర్టులను బ్లాక్​లిస్టులో పెట్టింది. వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.

US, French, Italians among 1,300 Tablighi foreign members identified in India
నిజాముద్దీన్​ ప్రార్థనల్లో పాల్గొన్న విదేశీయులు గుర్తింపు
author img

By

Published : Apr 2, 2020, 8:09 PM IST

దేశ రాజధాని నగరంలోని తబ్లీగీ జమాత్‌ కార్యక్రమానికి హాజరైన విదేశీయుల వీసాలను కేంద్రం రద్దు చేసింది. నిజాముద్దీన్‌ మర్కజ్‌ కార్యక్రమానికి హాజరైన 960 మంది పాస్‌పోర్టులను కేంద్ర హోంమంత్రిత్వశాఖ బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. ఈ విషయాన్ని ట్విట్టర్​ ద్వారా వెల్లడించింది. పర్యటక వీసాలపై వచ్చిన వీరంతా తబ్లీగీ జమాత్‌ కార్యకలాపాల్లో పాల్గొన్నట్టు గుర్తించిన కేంద్రం.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది.

MHA tweet
కేంద్ర హోంశాఖ ట్వీట్​

మొత్తం 1300 మంది

1300 మందికి పైనే విదేశీయులు జమాత్​ ప్రార్థనల్లో పాల్గొన్నట్లు ఇదివరకే వెల్లడించారు అధికారులు. వీరిలో అమెరికా, ఫ్రాన్స్​, ఇటలీ దేశాల నుంచి వచ్చినవారున్నట్లు స్పష్టం చేశారు. అత్యధికంగా దిల్లీలోనే 250 మంది ఉండగా.. ఎక్కువశాతం మంది నిజాముద్దీన్​ మర్కజ్​ ప్రాంతంలోనే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దేశ రాజధానిలోని 250 మంది విదేశీయుల్లో ఇద్దరు అమెరికన్లు, ఇండోనేషియా-172, కిర్గిస్థాన్​-36, బంగ్లాదేశ్​-21, మలేసియా-12, అల్జీరియా-7, అఫ్గానిస్థాన్​-2, ఫ్రాన్స్​, బెల్జియం, ఇటలీ, తునీసియా నుంచి ఒక్కో దేశస్థుడు ఉన్నాడు.

ఆంధ్రాలో-24, తెలంగాణలో-96

దిల్లీ తర్వాత ఉత్తర్​ప్రదేశ్​లో 247 మంది విదేశీయులుండగా.. మహారాష్ట్ర-154, తమిళనాడు-133, తెలంగాణ-96, హరియాణా-86, బంగాల్​-70, మధ్యప్రదేశ్​-59, ఝార్ఖండ్​-38, ఆంధ్రప్రదేశ్​-24, ఉత్తరాఖండ్​-12, ఒడిశా-7, రాజస్థాన్​లో అయిదుగురు ఉన్నారు.

కర్ణాటకలో 24 మంది పంజాబ్​లో ముగ్గురు ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించారు. అయితే వారందరూ లాక్​డౌన్​ కంటే ముందే దేశాన్ని విడిచి వెళ్లినట్లు స్పష్టం చేశారు.

ఇప్పటివరకు నిజాముద్దీన్​ మర్కజ్​ ప్రార్థనల్లో పాల్గొన్న 12 మంది మృతి చెందగా, 245 కేసులు నమోదయ్యాయి. అయితే దేశవ్యాప్తంగా తబ్లీగీ జమాత్​ సభ్యులతో పాటు వారితో కలిసి మెలిగినవారిని దాదాపు 9000 మందికిపైగా క్వారంటైన్​కు తరలిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.