దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ ఘటన అనంతరం పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. దాంతో ప్రజల ఆలోచనా విధానాల్లో మార్పు వచ్చిందని అందరూ భావించారు. కానీ ఉత్తర్‌ప్రదేశ్ హాథ్రస్ ఘటన సహా వెలుగులోకి వస్తోన్న అత్యాచారాలతో ఆ అంచనా తప్పని తెలుస్తోంది. దేశంలో జరుగుతోన్న అత్యాచారాలపై జాతీయ నేర గణాంక విభాగం తాజా నివేదికలో విస్తుపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా రోజుకు సగటున 87 మంది మహిళలపై అత్యాచారం జరుగుతున్నట్లు నివేదిక వెల్లడించింది. 2019లో దేశవ్యాప్తంగా 4,05,861 మహిళలు వేధింపులు ఎదుర్కొంటున్నట్లు కేసులు నమోదయ్యాయి. ఇందులో 32,033 అత్యాచారం కేసులు ఉండటం గమనార్హం.
తొలిస్థానంలో యూపీ..
2019లో నమోదైన మహిళలపై వేధింపుల మొత్తం కేసుల్లో 59,853 కేసులతో ఉత్తర్‌ప్రదేశ్ తొలిస్థానంలో నిలిచింది. అందులో 3,065 కేసులు అత్యాచారాలకు సంబంధించినవే ఉండటం గమనార్హం. ఇవి మొత్తం కేసుల్లో 10 శాతంగా ఉన్నాయి. యూపీ తర్వాత అత్యధికంగా రాజస్థాన్‌లో 41,550 మహిళలపై వేధింపుల కేసులు నమోదయ్యాయి. ఇందులో దాదాపు 5,997 అత్యాచారం కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో గత మూడు రోజుల్లోనే 18 అత్యాచార కేసులు నమోదు కావటం ఆందోళన కలిగిస్తోంది.
రాజస్థాన్ తర్వాత మూడో స్థానంలో మహారాష్ట్ర- 37,144 వేధింపుల కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్‌లోనూ 2,485 అత్యాచారం కేసులు నమోదయ్యాయని జాతీయ నేర గణాంక విభాగం వెల్లడించింది.
గత మూడేళ్లలో నమోదైన కేసుల వివరాలు..
- 2017: 3,59,849
- 2018: 3,79,236
- 2019: 4,05,861
ఈ మెుత్తం కేసుల్లో 30.9 శాతం నేరాలు... బాధితుల కుటుంబ సభ్యులు, బంధుల వల్లే జరుగుతున్నాయి. ఈ ఏడాది మార్చి 1 నుంచి సెప్టెంబర్ 18 మధ్యకాలంలో 13,244 అత్యాచారాలు, చిన్నారుల అశ్లీలత కేసులు నమోదయ్యాయని మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: