ETV Bharat / bharat

చైల్డ్​లైన్​లో చిన్నారుల 'నిశ్శబ్ద' వేదన

ఆపదలో ఉన్న పిల్లలకు ఆపన్నహస్తం అందించేందుకు ఏర్పాటు చేసిన చైల్డ్​లైన్​ 1098కు చెందిన ఓ నివేదిక నిర్ఘాంతపోయే విషయాలను వెల్లడించింది. బాలల హక్కుల రక్షణ కోసం ఏర్పాటైన ఈ హెల్ప్​లైన్​కు దాదాపు 40 శాతం 'సైలెంట్​ కాల్స్'​ వస్తున్నాయట. 2018 నుంచి ఈ ఏడాది సెప్టెంబర్​ వరకు దాదాపు 86 లక్షల ఫోన్​కాల్స్​ ఈ తరహాలో వచ్చినట్లు అధికారులు గుర్తించారు.

child helpline 1098 news
'చైల్డ్​లైన్​'లో చిన్నారుల మౌనవేదన
author img

By

Published : Oct 30, 2020, 4:11 PM IST

శారీరక, మానసిక వేధింపులకు గురవుతున్న చిన్నారులు, వివిధ కారణాల వల్ల బాల కార్మికులుగా మారిన బాలబాలికలు చైల్డ్​లైన్​ సెంటర్​కు కాల్​ చేస్తుంటారు. అయితే ఫోన్​ చేసిన బాధితులు ఎక్కువగా 'సైలెంట్​ కాల్స్​' చేయడాన్ని అధికారులు గుర్తించారు. తమ హక్కుల ఉల్లంఘనలపై నోరు మెదపలేక, ఇబ్బంది పెడుతున్న వారిపై ఫిర్యాదు చేసే ధైర్యం చేయలేక చిన్నారులు మౌన వేదన అనుభవిస్తున్నారట.

సైలెంట్​ కాల్​ అంటే...

సైలెంట్​ కాల్స్​ అంటే ఫోన్​ చేసిన బాధితుడు/కాలర్​ మాట్లాడకుండా కాల్​ను హోల్డ్​లోనే ఉంచుతారు. అయితే ఆ పరిసర ప్రాంతాల శబ్దాలు లేదా నాయిస్​ మాత్రం అవతలి వ్యక్తి(రిసీవర్​)కు వినిపిస్తుంది.

24 గంటలూ అందుబాటులోనే..

'చైల్డ్​లైన్​ 1098' సేవలు 24/7 అందుబాటులో ఉన్నాయి. ఇది దేశవ్యాప్తంగా దాదాపు 595 జిల్లాల్లో విస్తరించి సేవలు అందిస్తోంది. ఇదే కాకుండా రైల్వేశాఖ ఆధ్వర్యంలో 134 చైల్డ్​ హెల్ప్​ డెస్క్​లు కూడా ఉన్నాయి. ఈ సెంటర్లకు కాల్​ చేస్తే అక్కడ ఉండే సిబ్బంది.. పిల్లలు ఎదుర్కొంటున్న ఒత్తిడి, వారి మానసిక సమస్యలను తెలుసుకొని ధైర్యం చెప్తారు. ఇబ్బందుల్లో ఉంటే అధికారులు రంగంలోకి దిగి తక్షణమే సాయం చేస్తారు.

ఎన్నికాల్స్​ వచ్చాయంటే...

2018 జనవరి నుంచి ఈ ఏడాది సెప్టెంబర్​ వరకు దాదాపు 2.15 కోట్ల ఫోన్​కాల్స్​.. ఈ హెల్ప్​లైన్​కు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇందులో దాదాపు 86 లక్షల మంది 'సైలెంట్​ కాల్స్'​ చేసినట్లు స్పష్టం చేశారు.

" సైలెంట్​ కాల్స్​ అంటే బాధితులు సాయం కోసం ప్రయత్నిస్తున్నట్లు లెక్క. అయితే ఆ సమయంలో వారికి మాట్లాడేందుకు ధైర్యం సరిపోదు. చాలా సందర్భాల్లో హెల్ప్​లైన్​ సభ్యులు వారికి ధైర్యం చెప్పి కౌన్స్​లింగ్​ ఇచ్చినప్పుడు బాధిత వ్యక్తులు తమ గోడు చెప్పుకుంటారు. ఒక్కోసారి ఒకే నంబర్​ నుంచి 100 సార్లు కాల్స్​ చేస్తారు. అయితే అన్నిసార్లు మాట్లాడకుండా ఉన్న కాలర్.. చివరికి 101 కాల్​లో ధైర్యం చేసి తమ బాధ చెప్తారు.అందుకే మేము ఎలాంటి సైలంట్​ కాల్స్​ను డిస్​కనెక్ట్​ చేయం."

-- ఓ అధికారి

సైలెంట్​ కాల్స్​ గతంలో ఇంకా ఎక్కువగా వచ్చేవని.. గత మూడేళ్లుగా వాటి సంఖ్య తగ్గినట్లు అధికారులు వెల్లడించారు.

సంవత్సరంమొత్తం కాల్స్​సైలెంట్​ కాల్స్​
2018 1.01 కోట్లు 42 లక్షలు
2019 69 లక్షలు 27 లక్షలు
2020(సెప్టెంబర్​ వరకు) 43 లక్షలు 16 లక్షలు

ఇదే కారణం..

నిశ్శబ్ద​ కాల్స్​ సంఖ్య తగ్గటానికి చిన్నారులు ఈ హైల్ప్​లైన్​ సేవలు, చర్యల గురించి అవగాహన పొందటమే కారణమని అధికారులు వెల్లడించారు. చాలా మంది చిన్నారులు తమ గోడు చెప్పుకోడానికి ధైర్యం చేస్తున్నట్లు చెప్పారు.

"గత మాడేళ్లుగా సైలెంట్​ కాల్స్​ సంఖ్య తగ్గుతున్నాయి. మా చర్యలు, ప్రచార కార్యక్రమాల వల్ల చిన్నారుల్లో ఈ హైల్ప్​లైన్​ గురించి మరింత అవగాహన పెరుగుతోంది. చాలా మంది పిల్లలు తామ సమస్యల్లో చిక్కుకోకుండా సాయం పొందవచ్చని భావిస్తున్నారు. చాలా సందర్భాల్లో బాలబాలికలు ఆపన్నహస్తం కోసం కాల్​ చేసి.. ఈ నంబర్​కు కాల్​ చేస్తే ఏం జరుగుతుంది? అని కూడా ఆరా తీస్తుంటారు"

--ఓ అధికారి.

దేశవ్యాప్తంగా 18 ఏళ్లలోపు పిల్లలకు అన్నిరకాలుగా రక్షణ కల్పించడం కోసం ఈ చైల్డ్‌లైన్​ సేవలు అందిస్తోంది. కొవిడ్​-19 లాక్​డౌన్​ సమయంలో సైలెంట్​ కాల్స్​ సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు అధికారులు గుర్తించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.