ETV Bharat / bharat

'ఐహెచ్​సీ' సమావేశం వాయిదా- ప్రత్యామ్నాయంగా వెబినార్లు - ప్రొఫెసర్ ఎస్​సీ మిశ్రా మెమోరియల్ లెక్చర్​

కరోనా మహమ్మారి వల్ల ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ 81వ సమావేశం నిరవధికంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో కీలక సమస్యలు, అంశాలపై ఆన్​లైన్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఐహెచ్​సీ తెలిపింది. పంజాబ్ రైతుల నిరసనలు, భారతీయ నాగరితక వంటి విషయాలపై డిసెంబర్ 28 నుంచి 30 మధ్య వెబినార్లు జరగనున్నట్లు వెల్లడించింది.

81st session of Indian History Congress indefinitely postponed
ఇండియన్ హిస్టరీ సమావేశం వాయిదా
author img

By

Published : Dec 27, 2020, 11:31 AM IST

కరోనా వ్యాప్తి కారణంగా ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్(ఐహెచ్​సీ) 81వ సమావేశం వాయిదా పడింది. డిసెంబర్ 28-30 తేదీల్లో నిర్వహించాల్సిన సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ఐహెచ్​సీ అధికారికంగా ప్రకటించింది.

ఈ నేపథ్యంలో కీలకమైన సమస్యలను లేవనెత్తే ప్రఖ్యాత సంస్థగా.. 'ప్రొఫెసర్ ఎస్​సీ మిశ్రా మెమోరియల్ లెక్చర్​'ను ఆన్​లైన్​లో నిర్వహించాలని నిర్ణయించినట్లు ఐహెచ్​సీ తెలిపింది. ఇందులో భాగంగా 'పంజాబ్ రైతుల నిరసనలు: విరోచిత అహింసా ప్రతిఘటన' అనే అంశంపై ప్రముఖ చరిత్రకారులు మృదులా ముఖర్జీ ప్రసంగిస్తారని వెల్లడించింది. డిసెంబర్ 28న ఉదయం 11 నుంచి 12.30 గంటల మధ్య ఈ కార్యక్రమం జరుగుతుందని వివరించింది.

"ఐహెచ్​సీ 81వ సమావేశానికి అధ్యక్షుడిగా ఎంపికైన ప్రొఫెసర్ కేశవన్ వెలుతాట్.. ఈ కార్యక్రమానికి నేతృత్వం వహిస్తారు. డిసెంబర్ 28న 'పంజాబ్ రైతుల నిరసనలు: విరోచిత అహింసా ప్రతిఘటన' అంశంపై చర్చ ఉంటుంది. డిసెంబర్ 28, 29న 'భారతీయ నాగరితక: చారిత్రక దృక్పథాలు' అనే అంశంపై వెబినార్ జరుగుతుంది. ప్రఖ్యాత చరిత్రాకారుడు ప్రొఫెసర్ ఇర్ఫాన్ హబీబ్​ ప్రారంభోపన్యాసం ఇస్తారు."

-ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్

వెబినార్ ప్రారంభ కార్యక్రమానికి ప్రస్తుత ప్రొఫెసర్ అమియా బగ్చీ అధ్యక్షత వహిస్తారని తెలిపింది. ఈ వెబినార్​లో ఆదిత్య ముఖర్జీ, షిరీన్ మూస్వీ, కేఎం శిరిమాలి, రాజన్ గురుక్కల్, దీపక్ కుమార్, కుంకుమ్ రాయ్, సైయ్యద్ అలీ నదీ రెజావి, సుచేతా మహాజన్, సెల్వ కుమార్.. తదితరులు పాల్గొంటారని వెల్లడించింది. దీనికి ఇందు బంగ, అరుణ్ బందోపాధ్యాయ్​లు నేతృత్వం వహిస్తారని స్పష్టం చేసింది. వెబినార్​కు కార్యదర్శి ఆర్ మహాలక్ష్మి, నదీమ్ రెజావి, బర్టన్ క్లీటస్​లు కన్వినర్లుగా ఉన్నారని పేర్కొంది.

ఇదీ చదవండి: దేశంలో మరోసారి 20వేల దిగువకు కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.