ఇద్దరు నిందితులు హతం..
పోలీసుల కూంబింగ్ ఆపరేషన్‌లో ఇద్దరు దుండగులు హతమయ్యారు. మరో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇతర నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
10:15 July 03

09:05 July 03
పౌరుడికి గాయాలు..
కాన్పుర్ ఘటనలో ఓ పౌరుడు కూడా గాయపడ్డాడని తెలిపారు ఏడీజీ ప్రశాంత్ కుమార్. పోలీసుల ఆయుధాలు కొన్ని కనిపించట్లేదని తెలుస్తోంది. నిందితులను పట్టుకొని.. న్యాయస్థానం ముందు ప్రవేశపెడుతామని స్పష్టం చేశారు. ఆయన సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఫోరెన్సిక్ బృందాలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలు నిందితులను పట్టుకునేందుకు.. గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.
07:36 July 03
ఘటనా స్థలానికి ఫోరెన్సిక్ బృందం..
చీకటిగా ఉండటం వల్ల.. దాన్ని అదనుగా చేసుకొని నిందితులు తప్పించుకోగలిగారని తెలిపారు డీజీపీ. ఐజీ, ఏడీజీ, ఏడీజీ(శాంతి భద్రతలు) నేతృత్వంలో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు స్పష్టం చేశారు. కాన్పుర్ నుంచి ఫోరెన్సిక్ బృందం, లఖ్‌నవూ నుంచి నిపుణుల బృందం ఘటనా స్థలానికి చేరుకున్నట్లు తెలిపారు.
07:31 July 03
వికాస్‌పై కేసు నమోదు..
రౌడీ షీటర్ వికాస్ దూబేపై సెక్షన్ 307 కింద కేసు నమోదుచేసినట్లు తెలిపారు యూపీ డీజీపీ. అతనిని పట్టుకునేందుకు పోలీసులు ముమ్మర చర్యలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. పోలీసు వాహనాలను అడ్డుకునేందుకు.. జేసీబీలు అడ్డుగా పెట్టారని, ఆ సమయంలోనే పైనుంచి నేరస్థులు కాల్పులు జరిపారని వెల్లడించారు.
07:24 July 03
కూంబింగ్ ఆపరేషన్..
కాన్పుర్‌లో 8 మంది పోలీసులను బలిగొన్న నిందితులను పట్టుకునేందుకు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపారు కాన్పుర్ జోన్ ఏడీజీ జేఎన్ సింగ్. ఘటనలో నలుగురు పోలీసు సిబ్బంది గాయాలపాలయ్యారని పేర్కొన్నారు. పరిసర ప్రాంత పోలీసు బృందాలూ ఆపరేషన్‌లో భాగం కానున్నాయని స్పష్టం చేశారు.
07:21 July 03
ఉత్తర్‌ప్రదేశ్ కాన్పుర్‌లో దారుణం జరిగింది. రౌడీషీటర్ వికాస్ దూబేను పట్టుకునేందుకు చేపట్టిన ఆపరేషన్‌లో... దుండగుడి అనుచరులు పోలీసులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎనిమిది మంది పోలీసులు అమరులవ్వగా, మరో నలుగురు పోలీసు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మృతుల్లో డీఎస్పీ దేవేంద్ర మిశ్రా, ముగ్గురు సబ్ ఇన్స్పెక్టర్లు, నలుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. గాయపడిన వారిలో ఎస్ఓ బీతూర్ సహా ఏడుగురు పోలీసు సిబ్బంది ఉన్నారు.
"రౌడీషీటర్ వికాస్ దూబేను పట్టుకునేందుకు చౌబేపుర్ పోలీసుస్టేషన్ పరిధిలోని విక్రూ గ్రామానికి పోలీసులు వెళ్లారు. అయితే దుండగులు తాము తలదాచుకున్న ఇంటిపై నుంచి కాల్పులకు తెగబడ్డారు. ఈ దారుణ ఘటనలో 8 మంది పోలీసులు అమరులయ్యారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు."
- పోలీసులు
వికాస్ దూబేపై 60 వరకు క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని... వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు.
మృతుల కుటుంబాలకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు
06:36 July 03
యోగి విచారం..
కాన్పుర్ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమరులైన పోలీసుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై ఆరా తీశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు.
06:08 July 03
దుండగుల దాడి.. 8 మంది పోలీసులు మృతి
ఉత్తర్‌ప్రదేశ్ కాన్పుర్‌లో దారుణం జరిగింది. వికాస్ దూబే అనే రౌడీ షీటర్‌ను పట్టుకునేందుకు చేపట్టిన ఆపరేషన్‌లో.. అతని అనుచరులు పోలీసులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సీఓ, ఎస్ఓ సహా మొత్తం ఎనిమిది మంది పోలీసులు అమరులయ్యారు. మృతుల్లో డిప్యూటీ ఎస్పీ కూడా ఉన్నారు. మరో నలుగురు పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.