ETV Bharat / bharat

'ఆయుష్మాన్​ భారత్​'తో 5 నెలల్లోనే 9 కోట్ల మందికి లబ్ధి - కరోనా వైరస్​

ఆయుష్మాన్​ భారత్​ పథకం కింద పని చేస్తోన్న ఆరోగ్య, సంరక్షణ కేంద్రాలను(హెచ్​డబ్ల్యూసీ) 5 నెలల్లోనే దాదాపు 9 కోట్ల మంది సందర్శించినట్లు తెలిపింది కేంద్రం. ఓ వైపు కరోనా విజృంభిస్తున్నా వైద్య సేవలు అందించటంలో హెచ్​డబ్ల్యూసీలు కీలక పాత్ర పోషించినట్లు పేర్కొంది.

health and wellness centres under Ayushman Bharat
కరోనా కాలంలో ఆయుష్మాన్​ భారత్​ 'హెచ్​డబ్ల్యూసీ'ల రికార్డ్​!
author img

By

Published : Jul 10, 2020, 4:31 PM IST

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆయుష్మాన్​ భారత్​ పథకం ఆధ్వర్యంలోని ఆరోగ్య, సంరక్షణ కేంద్రాలు (హెచ్​డబ్ల్యూసీ) సరికొత్త రికార్డు సృష్టించాయి. ఈ పథకం కింద నడుస్తోన్న 41 వేల హెచ్​డబ్ల్యూసీలలో 2020, ఫిబ్రవరి 1 నుంచి ఇప్పటి వరకు 8.8 కోట్ల మందికి వైద్య సేవలు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

ఇది 2018, ఏప్రిల్​ 14 నుంచి 2020, జనవరి 31 వరకు 21 నెలల్లో నమోదైన సంఖ్యకు దాదాపు సమానమని తెలిపింది కేంద్రం. కరోనా మహమ్మారితో విధించిన లాక్​డౌన్​ ఆంక్షలు ఉన్నప్పటికీ 5 నెలల్లో ఇంత భారీ సంఖ్యలో రోగులకు సేవలు అందించినట్లు వెల్లడించింది.

గత ఐదు నెలల్లో అధిక రక్తపోటు రోగులు 1.41 కోట్లు, మధుమేహ వ్యాధిగ్రస్తులు 1.13 కోట్లు, నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్​ రోగులు 1.34 కోట్ల మందిని పరీక్షించినట్లు తెలిపింది.

కరోనా సవాళ్లు విసిరినప్పటికీ.. కేవలం జూన్​ నెలలోనే అన్ని హెచ్​డబ్ల్యూసీ కేంద్రాల ద్వారా రక్తపోటు రోగులు 5.62 లక్షలు, మధుమేహం రోగులు 3.77 లక్షల మందికి ఔషధాలు అందించినట్లు తెలిపింది ఆరోగ్య శాఖ. వీటితో పాటు కరోనా సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి 6.53 లక్షల యోగా, సంరక్షణ సెషన్లు నిర్వహించినట్లు పేర్కొంది.

కరోనా పోరులోనూ..

కొవిడ్​-19 మహమ్మారి పోరులోనూ ఆయుష్మాన్​ భారత్​ ఆధ్వర్యంలోని ఆరోగ్య, సంరక్షణ కేంద్రాలు కీలక పాత్ర పోషించినట్లు తెలిపింది కేంద్రం. కరోనాయేతర వ్యాధుల నియంత్రణలోనూ హెచ్​డబ్ల్యూసీలు కీలకంగా వ్యవహరించాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

  • ఝార్ఖండ్​లో ఇన్​ప్లూయెంజా సంబంధిత అనారోగ్యం (ఐఎల్​ఐ), తీవ్ర శ్వాసకోశ సంబంధిత అనారోగ్యం(ఎస్​ఏఆర్​ఐ) లక్షణాలు గల వారిని పరీక్షించి.. కరోనా పరీక్షలను సులభతరం చేశాయి హెచ్​డబ్ల్యూసీ బృందాలు.
  • ఒడిశాలోని పలు కేంద్రాల్లో ఆరోగ్య పరీక్షలతో పాటు కొవిడ్​-19ను తరిమికొట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించాయి.
  • వలస కార్మికుల కోసం ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాల నిర్వహణ.

కరోనా కాలంలో అదనంగా.. మరో 12 వేలు

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైన తర్వాత 2020 జనవరి నుంచి జూన్ మధ్య అదనంగా మరో 12,425 హెచ్​డబ్ల్యూసీ కేంద్రాలు పనిచేసినట్లు వెల్లడించింది కేంద్రం. గతేడాది 29,365గా ఉన్న కేంద్రాల సంఖ్య ఇప్పుడు 41,790కి చేరినట్లు వివరించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.