బంగాల్ తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని దిఘా సముద్రతీరంలో... జాలారుల వలకు 780 కిలోల భారీ చేప చిక్కింది. దీనిని స్థానికంగా 'శంకర్ చేప' అంటారని మత్స్యకారులు తెలిపారు. సోమవారం ఉదయం కొంత మంది జాలారులు కలిసి సముద్రంలోకి వేటకు వెళ్లగా... ఈ భారీ చేప చిక్కింది. దీనిని చూడడానికి స్థానిక ప్రజలు గుంపులుగా సముద్రతీరానికి చేరుకోవటంతో అక్కడ అంతా కోలాహలం చోటుచేసుకుంది.
![780 kg shankar fish caught by odisha fisherman in Digha](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/wbemid01dighabigfishwb10010_27072020090514_2707f_1595820914_236_2707newsroom_1595824860_877.jpg)
![780 kg shankar fish caught by odisha fisherman in Digha](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/wbemid01dighabigfishwb10010_27072020090514_2707f_1595820914_341_2707newsroom_1595824860_1035.jpg)
![780 kg shankar fish caught by odisha fisherman in Digha](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/wbemid01dighabigfishwb10010_27072020090514_2707f_1595820914_1067_2707newsroom_1595824860_63.jpg)
ఇదీ చూడండి: దేశ భద్రతలో సీఆర్పీఎఫ్ది కీలక పాత్ర: మోదీ