ETV Bharat / bharat

ప్రపంచ రికార్డు సాధించిన 70 అడుగుల 'చెత్త గిటారు' - creativity

చదువంటే ధ్రువపత్రాలు కాదు.. మనలోని సృజనకు పదును పెట్టే సాధనం అని నిరూపించారా విద్యార్థులు. వారి విద్యానైపుణ్యాన్ని కళాశాలలోనే ప్రయోగించారు. వ్యర్థ పదార్థాలతో 70 అడుగుల గిటార్​ తయారు చేసి.. ఏషియన్​ బుక్​ ఆఫ్ వరల్డ్​​ రికార్డ్స్​లో చోటు సంపాదించారు.

చెత్తతో 70 అడుగుల గిటారు.. వరించిన ప్రపంచ రికార్డు!
author img

By

Published : Aug 23, 2019, 5:32 AM IST

Updated : Sep 27, 2019, 11:02 PM IST

ప్రపంచ రికార్డు సాధించిన 70 అడుగుల 'చెత్త గిటారు'
ఒడిశా బ్రహ్మపుర ఐటీఐ విద్యార్ధులు వ్యర్థ పదార్థాలతో సృష్టించిన అద్భుత కళాఖండానికి ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చింది. పనికిరాని వ్యర్థాలతో రూపొందించిన 70 అడుగుల గిటార్​.. ఇప్పడు ఏషియన్​ బుక్ ఆఫ్​ వరల్డ్​​ రికార్డ్స్​లో చోటు దక్కించుకుంది.

విపత్తులోంచి వినూత్నం

ఫొని తుపాను తాకిడికి అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఎన్నో వస్తువులు కొట్టుకుపోయాయి. రాష్ట్రంలో ఎక్కడ చూసినా వ్యర్థాలు. ఐటీఐ కళాశాల బ్రహ్మపుర విద్యార్థుల ఆ వ్యర్థాలను ఎలా వినియోగించవచ్చో ఆలోచించారు. వారి చదువుకు ఓ అర్థాన్నిచ్చేలా వ్యర్థాలతో ఆకృతులను నిర్మించాలని పూనుకున్నారు.

కళాశాల ఆవరణని శుభ్రం చేసుకుని పర్యావరణ హిత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆకృతుల నిర్మాణాలపై పరిశోధనలు చేశారు. కళాశాలలో పెయింటర్లు, వెల్డింగ్‌, ఎలక్ట్రిషియన్‌, ఫిట్టింగ్‌, ప్లంబింగ్​ల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులు ఇలా ప్రాక్టికల్​గా తమ నైపుణ్యానికి పదునుపెట్టారు.

ఇంకా... భారీ ఆకారంలో ఉన్న మనిషి, తాబేలు, జిరాఫీ వంటి 70 ఆకృతులను నిర్మించారు. ప్రధానోపాధ్యాయులు రజత్‌ కుమార్‌ పాణిగ్రాహి ప్రోత్సాహంతో ఇలా వారి సృజనను ప్రపంచానికి చాటారు. ఫలితంగా.. 70 అడుగుల గిటార్ ఏషియన్​ బుక్​ ఆఫ్ వరల్డ్​​ రికార్డ్స్​​లో ఓ పేజీని సొంతం చేసుకుంది.

ఇదీ చూడండి:వన్యప్రాణుల మధ్య విందు అదరహో..!

Intro:Body:Conclusion:
Last Updated : Sep 27, 2019, 11:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.