ETV Bharat / bharat

కల్తీ మద్యం కాటుకు ఏడుగురు మృతి - రాజస్థాన్​ భరత్​పుర్

కల్తీ మద్యం సేవించి ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన రాజస్థాన్​ భరత్​పుర్​ జిల్లాలో జరిగింది. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు.. మధ్యప్రదేశ్​ మురైనా జిల్లా ఘటనలో మృతుల సంఖ్య 24కు చేరింది.

consumption of poisonous liquor
కల్తీ మద్యం కలకలం
author img

By

Published : Jan 14, 2021, 12:46 PM IST

రాజస్థాన్​ భరత్​పుర్​ జిల్లాలో విషాదం జరిగింది. కల్తీ మద్యం సేవించి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన జిల్లాలోని చక్​ సామరి గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగింది.

కల్తీ మద్యం సేవించి 10 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించే సమయంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మందిని భరత్​పుర్​ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్థానికులు. చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి ఇద్దరు మృతి చెందారు. గురువారం ఉదయం మరో ముగ్గురు మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య ఏడుకు చేరింది. ఈ ఘటనలో ఇంకా ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

జిల్లాలో మద్యం విక్రయాలకు అనుమతులు లేవని తెలిపారు జిల్లా పాలనాధికారి మహేశ్​ జోషి. ఘటనపై పూర్తి విచారణ జరపాలని అబ్కారీ శాఖను ఆదేశించారు. కల్తీ మద్యం విక్రేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వస్తే మరణాలకు గల పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు.

చాలా రోజులుగా గ్రామంలో కల్తీ మద్యం విక్రయాలు జరుగుతున్నాయని, అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామస్థులు. కల్తీ మద్యం విక్రయిస్తోన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

24కు చేరిన మృతుల సంఖ్య

మధ్యప్రదేశ్​లోని మురైనా జిల్లా ఘటనలో కల్తీ మద్యానికి మరో ముగ్గురు బలయ్యారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 24కు చేరింది. మరో 17 మంది వరకు చికిత్స పొందుతున్నారు. మృతులు చైరా గ్రామానికి చెందినవారిగా పోలీసులు తెలిపారు. మరోవైపు ఘటనపై విచారణ చేపట్టేందుకు ముగ్గురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం మురైనాకు చేరుకుంది. పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమైంది.

ఇదీ చూడండి: కోరినంత మందు పోయలేదని వరుడి హత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.