ETV Bharat / bharat

బిహార్​లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి - Seven killed in road accident

బిహార్​ గయా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా... నలుగురికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను దగ్గరలోని ఆస్పత్రికి తరలించామని,కొందరు పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.

7 killed, 4 injured in road accident in Bihar's Gaya district
బిహార్​లో రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
author img

By

Published : Jun 15, 2020, 2:14 PM IST

బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ట్రక్కు రెండు ఆటోలను ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృత్యువాతపడగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గయా జిల్లాలోని బిష్ణుగంజ్‌ గ్రామం సమీపంలోని జీటీ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.

మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. అలాగే, ఈ ప్రమాదంలో గాయాలైన వారిని సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు పోలీసులు. క్షతగాత్రుల్లో కొందరి ఆరోగ్యం విషమంగా ఉందన్నారు. బాధితులు రెగానియా ప్రాంతంలో జరిగిన ఓ వేడుకలో పాల్గొని రెండు ఆటోల్లో (గయా నుంచి ఔరంగాబాద్‌ వైపు) ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.

ఇదీ చూడండి: దిల్లీలో కరోనా తీవ్రం.. 6 రోజుల్లోనే 10వేల కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.