జాతీయ నేర నమోదు విభాగం (ఎన్సీఆర్బీ)తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం 2018తో పోలిస్తే 2019లో దేశంలోని 19 మెట్రో నగరాల్లో నేరాలు 7.3శాతం పెరిగాయి. ఈ నగరాల్లో 2018లో మొత్తం నేరాల సంఖ్య 8,02,267 కాగా 2019లో ఆ సంఖ్య 8,60,960కి పెరిగింది. వీటిలో 6,04,897కేసులు భారత శిక్షాస్మృతి చట్టం కింద నమోదు కాగా.. 2,56,063కేసులు ప్రత్యేక,స్థానిక చట్టాల కింద నమోదయ్యాయి.
అధిక నేరాలు నమోదైన నగరాలు
1. దిల్లీ -3,11,092కేసులు
2. చెన్నై -71,949కేసులు
3. అహ్మదాబాద్ -53,538కేసులు
4. బెంగళూరు -41,854కేసులు
5. కోయంబత్తూర్ -15,821కేసులు
ఐపీసీ సెక్షన్ కింద నమోదైన కేసుల్లో 51 శాతం దొంగతనానికి సంబంధించినవి కాగా.. 9.5 శాతం రాష్ డ్రైవింగ్ కేసులు.
దేశవ్యాప్తంగా హత్యా నేరాల్లో మాత్రం ఉత్తర్ ప్రదేశ్, బిహార్ రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయి.
హత్యా నేరాలు అధికంగా ఉన్న రాష్ట్రాలు..
1. ఉత్తర్ ప్రదేశ్ -3,806కేసులు
2. బిహార్ -3,138కేసులు
3. మహారాష్ట్ర -2,142కేసులు
4. మధ్యప్రదేశ్ -1,795కేసులు
5. ఝార్ఖండ్ -1,626కేసులు