మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణంతో దేశంలో విషాదం నెలకొంది. ఆయన అందించిన సేవలను స్మరించుకొనేందుకు దేశ వ్యాప్తంగా ఏడు రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు, పార్లమెంట్, రాష్ట్రపతిభవన్ సహా అన్ని కార్యాలయాలపైనా జాతీయ జెండాను అవనతం చేశారు.
ప్రణబ్‌కు అధికారిక లాంఛనాలతో వీడ్కోలు పలికేందుకు రక్షణ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. సైనిక గౌరవ వందనంతో వీడ్కోలు పలికేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
21 రోజులగా ఆస్పత్రిలో..
ఈ నెల 10న అనారోగ్యంతో దిల్లీలోని సైనిక ఆస్పత్రిలో చేరిన ప్రణబ్ ముఖర్జీకి వైద్యులు మెదడులో ఏర్పడిన కణితికి శస్త్ర చికిత్స చేశారు. అంతకుముందు నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. అప్పటి నుంచి ఆస్పత్రిలో 21 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన.. సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.
ఇదీ చూడండి: సాధారణ క్లర్క్ స్థాయి నుంచి భారత రాష్ట్రపతిగా...