ETV Bharat / bharat

కాపురాలపై కరోనా దెబ్బ.. రెండేళ్ల వరకు పిల్లల్ని కనొద్దట!

పెళ్లి అయిందంటే చాలు.. ఏడాది తిరగకుండానే మనవడినో, మనవరాలినో ఇవ్వాలంటూ నానమ్మలు, అమ్మమ్మలు తెగ తొందరపెట్టేస్తారు. కానీ, మహారాష్ట్రలోని ఓ గ్రామంలో మాత్రం రెండేళ్ల వరకు పిల్లల జోలికి పోవద్దంటున్నారు. అందుకు అంగీకరించి, కొత్తగా పెళ్లయిన 60 జంటలు 2022 వరకు పిల్లలను కనబోమని ముక్తకంఠంగా నిర్ణయం తీసుకున్నారు.

60-newly-married-young-couples-tooke-decision-not-to-have-children-for-two-years-due-to-corona-in maharastra godhegav
కాపురాలపై కరోనా దెబ్బ.. రెండేళ్ల వరకు పిల్లల్ని కనొద్దట!
author img

By

Published : Jun 4, 2020, 5:16 PM IST

Updated : Jun 4, 2020, 5:48 PM IST

గర్భం దాల్చింది మొదలు ఆసుపత్రుల చుట్టూ తిరగాలి. సీమంతం, బారసాల, అన్నప్రాసన, తలనీలాలిచ్చి మొక్కులు తీర్చుకోవడం అబ్బో ఒక్కటేమిటి పిల్లలు పుడితే చిన్నాపెద్ద ఫంక్షన్లు బోలెడు. మరి, కరోనా కాలంలో అలాంటి శుభకార్యాల్లో భౌతిక దూరం ఉంటుందా? ఈ కాలంలో గర్భిణులు, పుట్టే పసికందులు సురక్షితంగా ఉంటారా? అందుకే, మహారాష్ట్ర అహ్మద్​నగర్​ జిల్లా గోధేగావ్​లో ఒకేసారి 60 కొత్త జంటలు రెండేళ్ల దాకా పిల్లలను కనకూడదని నిర్ణయించుకున్నారు.

2020-2021ని కరోనా కాలంగా పరిగణిస్తూ.. ఈ కాలంలో గర్భం దాల్చి శిశువును ప్రమాదంలోకి నెట్టకూడదని ఆ గ్రామ పంచాయతీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. అందుకే, రెండేళ్ల పాటు గర్భం దాల్చకుండా నవజాత శిశువులను కరోనా ప్రమాదం నుంచి తప్పించేందుకు మహిళలు సైతం ఇందుకు ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. గ్రామస్థులు స్వచ్ఛందంగా వారి కుటుంబాల్లో మహిళలు గర్భం దాల్చనీయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇదీ చదవండి:కరోనా కాలంలో కళ్లను కాపాడుకోండి ఇలా..

Last Updated : Jun 4, 2020, 5:48 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.