ఝార్ఖండ్ ధన్బాద్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు కరోనా బారినపడి మృతి చెందారు.
ధన్బాద్ జిల్లా కత్రాస్కు చెందిన చౌదరి కుటుంబంలో ఒక్కొక్కరిగా ఆరుగురిని బలిగొంది కరోనా. దిల్లీలో ఉంటున్న కుమారుడి దగ్గరి నుంచి.. ఓ పెళ్లికి హాజరయ్యేందుకు ధన్బాద్కు వచ్చింది 88 ఏళ్ల తల్లి. పెళ్లి పూర్తయ్యాక ఆమెకు ఒంట్లో నలతగా అనిపించింది. దీంతో ఆసుపత్రికి వెళ్లింది. జులై 4వ తేదీన చికిత్స పొందుతూనే మృతి చెందింది. అప్పటికి ఆమెకు కరోనా సోకిందని నిర్ధరణ కాలేదు. దీంతో ఐదుగురు కుమారులు కలిసి అమ్మకు అంత్యక్రియలు నిర్వహించారు.
ఆ తర్వాత అమ్మకు నిర్వహించిన కరోనా పరీక్ష ఫలితాలొచ్చాయి. ఆమెకు కరోనా ఉందని తేలింది. ఈ లోపే ఓ తనయుడు కరోనా బారినపడి మృతి చెందాడు. ఆపై నలుగురు కుమారులకు కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయ్యింది. కానీ, అప్పటికే ఆలస్యమైపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒక్కొక్కరిగా మృత్యు ఒడిలోకి చేరారు.
ఇదీ చదవండి: లోపల అమ్మ మరణయాతన.. బయట బిడ్డ వేదన!