అసోం గోర్చుక్లోని కాటబడిలో చిరుతను చంపిన కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న మరికొంతమంది కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
"కాటబడిలో చిరుతను చంపిన ఘటనపై కేసుల నమోదు చేశాం. ఆరుగురిని అదుపులోకి తీసుకున్నాం. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నాం."
- గువాహటి పోలీసులు
కాటబడి ప్రాంతంలో చిరుతను ఆదివారం కొట్టి చంపారు స్థానికులు. అనంతరం దాని దంతాలు, గోళ్లు తొలగించారు.
ఇదీ చూడండి: ఒడిశా తీరంలో ఓలివ్ రిడ్లే తాబేళ్ల కనువిందు