ETV Bharat / bharat

భారత్​ అమ్ములపొదిలో 'ధనుష్ శతఘ్నులు' - DRDO

భారత సైన్యం మరింత పటిష్టమైంది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అత్యాధునిక ధనుష్ శతఘ్నులు అందుబాటులోకి వచ్చాయి. మధ్యప్రదేశ్ జమల్​పురలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఆర్డ్​నెన్స్​ ఫ్యాక్టరీ బోర్డు (ఓఎఫ్​బీ) భారత సైన్యానికి 6 శతఘ్నులను అప్పగించింది.

భారత్​ అమ్ములపొదిలో 'ధనుష్ శతఘ్నులు'
author img

By

Published : Apr 8, 2019, 8:39 PM IST

సరిహద్దు భద్రతలో భారత సైన్యం మరింత బలోపేతమైంది. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి పూర్తిగా స్వదేశీ పరిజ్జానంతో తయారు చేసిన ధనుష్ శతఘ్నులు సైన్యానికి అందుబాటులోకి వచ్చాయి. మొత్తం 114 ధనుష్​ శతఘ్నులను తయారు చేయాల్సి ఉంది ఆర్డ్​నెన్స్​ ఫ్యాక్టరీ బోర్డు (ఓఎఫ్​బీ). ప్రస్తుతానికి ఆరు శతఘ్నులను మధ్యప్రదేశ్ జమల్​పురలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో సైన్యానికి అప్పగించింది ఓఎఫ్​బీ. మేకిన్‌ ఇండియా కార్యక్రమం ద్వారా భారత సైన్యానికి అందుతున్న తొలి శతఘ్ని ధనుష్​. దీని బరువు 13టన్నుల లోపే ఉంటుంది.

ఆర్డ్​నెన్స్ ఫ్యాక్టరీ బోర్డు, డీఆర్‌డీవో, డీజీక్యూఏ, డీపీఎస్‌యూ, భారత్‌ ఎలక్ట్రానిక్‌ లిమిటెడ్‌, సెయిల్‌తో పాటు పలు ప్రైవేటు సంస్థలు సంయుక్తంగా ధనుష్ శతఘ్నులను తయారు చేస్తున్నాయి.

ధనుష్​ ప్రత్యేకతలు

⦁ ఆటోమేటెడ్ టెక్నాలజీతో ఒకేసారి మూడు నుంచి ఆరు శతఘ్నులతో ఒకే లక్ష్యం వైపు కాల్పులు జరపవచ్చు.

⦁ గంటకు 42 రౌండ్ల వరకు కాల్పులు జరపగలదు.

⦁ 38 కిలోమీటర్ల దూరం వరకు దాడి చేసే సామర్థ్యం

⦁ పగలు, రాత్రితో సంబంధం లేకుండా ఎలాంటి వెలుతురులోనైనా దాడులు చేయగలదు.

⦁ స్వయంచోదక(సెల్ఫ్‌ ప్రొపెల్షన్‌) వ్యవస్థ, ఆటోలేయింగ్‌ సౌకర్యం

ఇదీ చూడండి: '1 కాదు... 5 వీవీప్యాట్​ రసీదులు లెక్కించండి'

AP Video Delivery Log - 1000 GMT News
Monday, 8 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0947: Italy EU Salvini AP Clients Only 4204905
Italy's Salvini forms alliance of far-right parties
AP-APTN-0943: Luxembourg EU FMs AP Clients Only 4204903
EU FMs on Brexit and Libya ahead of meeting
AP-APTN-0917: China MOFA Briefing AP Clients Only 4204906
DAILY MOFA BRIEFING
AP-APTN-0851: SKorea Unification Minister No access South Korea 4204901
SKorea's Moon appoints new Unification Minister
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.