తమిళనాడులో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడం లేదు. కొత్తగా 5,880 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 119 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 2,85,024కి చేరింది. మృతుల సంఖ్య 4,690కి పెరిగింది. 2,27,575 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
యూపీలో రికార్డు స్థాయిలో..
ఉత్తర్‌ప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరుగుతోంది. 24 గంటల్లో 4,404 కొత్త కేసులు నమోదు కాగా.. 63మంది చనిపోయారు. మొత్తం బాధితుల సంఖ్య 1,13,378కి చేరింది. మొత్తం 1,981 మందిని వైరస్ బలిగొంది.
దిల్లీలో..
దేశ రాజధాని దిల్లీలో మరో 1,192మంది వైరస్ బారినపడ్డారు. కొత్తగా 23మంది మృత్యువాతపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 1,42,723కి చేరగా.. ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,082కి పెరిగింది.
కశ్మీర్లో..
జమ్ముకశ్మీర్‌లో కొత్తగా నమోదైన 473 కేసులతో కలిపి మొత్తం బాధితుల సంఖ్య 23,927కి చేరింది. ఇప్పటివరకు 449 మంది వైరస్ కారణంగా చనిపోయారు.
కేరళలో..
కేరళలో కొత్తగా 1,251మందికి పాజిటివ్‌గా తేలింది. మరో ఐదుగురు మరణించారు.