మహారాష్ట్రలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృభిస్తోంది. తాజాగా 11,088 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 5,35,601కు చేరింది. 256మంది ప్రాణాలు కోల్పోగా.. మృతుల సంఖ్య 18,306కు పెరిగింది.
అయితే ఒక్కరోజులో 10వేల 014మంది కరోనాను జయించి ఇళ్లకు చేరారు. రాష్ట్రంలో రికవరీ రేటు 68.79శాతానికి చేరింది.
తమిళనాడు...
తమిళనాడులో తాజాగా 5,834 మందికి కరోనా సోకింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 3,08,649 మందికి వైరస్ నిర్ధరణ అయ్యింది. 118 తాజా మరణాలతో మృతుల సంఖ్య 5,159కు పెరిగింది. యాక్టివ్ కేసుల సంఖ్య 52,810గా ఉంది.
తమిళనాడులో రోజువారీ కేసుల కన్నా.. రోజువారీ రికవరీల సంఖ్య ఎక్కువగా ఉండటం కాస్త ఊరటనిచ్చే విషయం. కొత్తగా 6,005మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు 2,50,680మంది కరోనాను జయించి ఇళ్లకు చేరారు.
ఉత్తర్ప్రదేశ్లో రికార్డు..
ఉత్తర్ప్రదేశ్లో వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. తాజాగా రికార్డుస్థాయిలో 5,041 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,31,763కు చేరింది. 56 తాజా మరణాలతో మృతుల సంఖ్య 2,176కు పెరిగింది.
రాష్ట్రంలో మొత్తం మీద 8,998 యాక్టివ్ కేసులున్నాయి. 80,589 మంది కరోనాను జయించి ఇళ్లకు చేరారు.
దిల్లీలో..
దిల్లీలో వైరస్ ఉద్ధృతి తగ్గింది. తాజాగా 1,257 మందికి వైరస్ నిర్ధరణ అయ్యింది. మరో 8 మంది వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 1,47,391కు చేరగా.. మొత్తం మరణాల సంఖ్య 4,139కు పెరిగింది.
రాష్ట్రం | కొత్త కేసులు | మొత్తం కేసులు |
మహారాష్ట్ర | 11,088 | 5,35,601 |
కర్ణాటక | 6,257 | 1,88,611 |
తమిళనాడు | 5,834 | 3,08,649 |
ఉత్తర్ప్రదేశ్ | 5,041 | 1,31,763 |
బిహార్ | 4,071 | 58,088 |
ఒడిశా | 1,341 | 48,796 |
దిల్లీ | 1,257 | 1,47,391 |
పంజాబ్ | 1,002 | 25,889 |
మధ్యప్రదేశ్ | 843 | 40,734 |
జమ్ముకశ్మీర్ | 564 | 25,931 |
మణిపుర్ | 88 | 3,941 |
ఇదీ చూడండి:- 70 శాతానికి చేరువలో కరోనా రికవరీ రేటు