పాకిస్థాన్ నుంచి భారత్‌కు అక్రమంగా తరలిస్తున్న రూ. 2700కోట్లు విలువ చేసే 532 కేజీల హెరాయిన్ పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. పంజాబ్ అటారీ సరిహద్దు ప్రాంతంలో తనిఖీల్లో భాగంగా ఓ ట్రక్కులో పెద్దమొత్తంలో హెరాయిన్‌ను గుర్తించారు.
ఈ కేసుకు సంబంధించి కశ్మీర్‌కు చెందిన స్మగ్లింగ్ రాకెట్ సూత్రధారి, అమృత్‌సర్‌కు ఉప్పు దిగుమతి చేసే వ్యాపారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ట్రక్కులో వందలాది రాతి ఉప్పు బస్తాల్లో 52 కేజీల మిక్స్డ్ నార్కొటిక్నూ గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కస్టమ్స్ చరిత్రలో ఇంత భారీ స్థాయిలో మాదకద్రవ్యాలు పట్టబడడం ఇదే తొలిసారని అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: పులి వేట నుంచి తప్పించుకున్న బైకర్లు