ETV Bharat / bharat

కరోనా వేళ బిహార్​లో 'పోస్టల్ బ్యాలెట్'​ వైపే మొగ్గు - postal ballot voting bihar

కరోనా మహమ్మారి దృష్ట్యా అక్టోబరు 28న జరగనున్న బిహార్​ మొదటిదశ ఎన్నికల్లో దాదాపు 52వేల మంది ఓటర్లు 'పోస్టల్​ బ్యాలెట్'​ పద్ధతిని వినియోగించుకోనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. 80ఏళ్లకు పైబడినవారు, దివ్యాంగులు ఈ పద్ధతి ​ ద్వారా ఇంట్లోనే ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేసింది.

52,000 voters opt for postal ballot in Ph 1 of Bihar polls
కరోనా వేల పోస్టల్ బ్యాలెట్​ వైపే మొగ్గు
author img

By

Published : Oct 12, 2020, 6:17 PM IST

కరోనా దృష్ట్యా 'పోస్టల్​ బ్యాలెట్​' పద్దతిని ఎన్నికల సంఘం సులభతరం చేసింది. ఫలితంగా వృద్ధులు, దివ్యాంగులు ఈ పద్ధతిలో ఓటు వేసేందుకు మొగ్గు చూపుతున్నారు. బిహార్​లో అక్టోబరు 28న జరగనున్న మొదటిదశ ఎన్నికల్లో దాదాపు 52వేల ఓటర్లు బ్యాలెట్​ పద్ధతి ద్వారా ఓటు వేసేందుకు సిద్ధమయ్యారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

బిహార్​లో మొదటిదశ ఎన్నికలు జరగనున్న 71 నియోజకవర్గాల్లో నాలుగు లక్షలకు పైగా ఉన్న దివ్యాంగులు, వృద్ధుల్లో 52వేల మంది పోస్టల్​ బ్యాలెట్​ ద్వారా ఓటు వేసేందుకు సుముఖంగా ఉన్నారు.

-- ఎన్నికల సంఘం

బ్యాలెట్​ పద్ధతిలో ఓటు ఎలా?

పోస్టల్​ బ్యాలెట్​ పద్ధతిలో ఓటు వేయాలనుకునేవారు మొదటగా ఓ ఫామ్​ నింపాలి. బూత్​ అధికారి స్వయంగా ఓటర్ల ఇంటికి వెళ్లి సంబంధిత పత్రాలు అందజేస్తారు. పూర్తి భద్రత, పారదర్శకత, గోప్యత తో ఓటును వినియోగించుకోవచ్చు. ఓటు వేసేటప్పుడు పారదర్శకత కోసం వీడియో తీయనున్నారు అధికారులు.

రెండు, మూడు దశల్లోనూ..

కొవిడ్​ మహమ్మారి దృష్ట్యా నవంబరు 3, 7 తేదీల్లో జరగనున్న ఎన్నికల్లోనూ పూర్తి భద్రతతోపాటు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనుంది ఈసీ. ఈ రెండు దశల్లో జరగనున్న ఎన్నికల్లో దాదాపు 12లక్షలమంది పోస్టల్​ బ్యాలెట్​కు మొగ్గుచూపే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఇదీ చదవండి :కాంగ్రెస్​కు ఖుష్బూ గుడ్​బై- భాజపాకు జై

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.