భారత్‌లో కొవిడ్ మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తోంది. తమిళనాడులో కొత్తగా 5,175 మందికి వైరస్ సోకింది. మరో 112మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 2,73,460కి చేరింది. మరణాల సంఖ్య 4,461కి పెరిగింది. 2,14,815 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
కేరళలో..
కేరళలో తాజాగా 1,195 మంది కరోనా బారిన పడ్డారు. మరో ఏడుగురు వైరస్‌కు బలయ్యారు. 971మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు . ప్రస్తుతం రాష్ట్రంలో 11,167మంది చికిత్స పొందుతున్నారు.
దిల్లీలో..
దిల్లీలో మంగళవారంతో పోల్చితే కేసుల సంఖ్య పెరిగింది. కొత్తగా 1,076మందికి కరోనా నిర్ధరణ అయింది. మరో 11 మంది మృతిచెందారు. మొత్తం కేసులు సంఖ్య 1,40,232కు చేరగా... మరణాల సంఖ్య 4,044కి పెరిగింది.
ఇదీ చూడండి: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అంకురార్పణ