రాజస్థాన్ జోధ్‌పుర్‌లో ఐదేళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయిన ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర అలజడి రేపుతోంది.
అమ్మమ్మ వాళ్లింటికి వెళ్లి..
కొద్ది రోజుల క్రితమే బావరీ మండలం జోయింత్రా గ్రామంలోని అమ్మమ్మ వాళ్లింటికి వచ్చాడు ఐదేళ్ల రోహిత్. రోజూలాగే తాతయ్యతో కలిసి పొలం దగ్గరకు వెళ్లాడు. చిరునవ్వులతో ఆడుకుంటున్న తాను.. మూతలేని ఆ బోరు బావిని గమనించలేదు. పైగా అది 100 అడుగుల లోతు ఉంటుందని ఊహించలేదు. చిన్ని చిన్ని అడుగులు వేసుకుంటూ ప్రమాదవశాత్తు బోరుబావిపై కాలు వేశాడు. అంతే, క్షణాల్లో తానెప్పుడూ చూడని చీకటి సొరంగంలో పడిపోయాడు.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. తహసీల్దార్, 108 అంబులెన్స్, రాష్ట్ర విపత్తు స్పందన దళంతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. పైపుల ద్వారా బాలుడికి ఆక్సిజన్ అందిస్తున్నారు.
అంధకారంలో భయపడుతూ చిన్నారి ఏడుస్తున్న శబ్ధాలు స్పష్టంగా వినిపిస్తున్నాయని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:తండ్రి అంత్యక్రియలకు ముఖ్యమంత్రి దూరం