ETV Bharat / bharat

మహారాష్ట్రలో 15వేలు దాటిన కరోనా కేసులు - దేశంలో కరోనా కేసులు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్నమహారాష్ట్రలో ఇవాళ 800 మందికిపైగా వైరస్​ సోకినట్లు నిర్ధరణ అయింది. దేశ రాజధాని దిల్లీలోనూ కోసులు 5వేలు దాటాయి. తమిళనాడులో 508, గుజరాత్​లో 441, పంజాబ్​లో 219 మందికి ఇవాళ కొత్తగా వైరస్​ నిర్ధరణ అయింది. హిమాచల్​ ప్రదేశ్​లో గత 12 రోజుల నుంచి ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

5 more die of COVID-19 in Rajasthan; toll rises to 82
దేశంలో కరోనా పంజా... తమిళనాడులో నేడు 508 కేసులు
author img

By

Published : May 5, 2020, 9:13 PM IST

Updated : May 5, 2020, 9:44 PM IST

దేశంలో కరోనా కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో వైరస్ కేసులు నమోదయ్యాయి. తర్వాతి స్థానాల్లో గుజరాత్, దిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు ఉన్నాయి.

మహారాష్ట్రలో 15వేలు దాటిన కేసులు

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉద్ధృతి ఎక్కువగా ఉంది. ఇవాళ ఒక్కరోజే 841 మంది మహమ్మారి బారిన పడగా.. ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 15,525కు చేరింది. ఇప్పటివరకు మొత్తం 617 మంది వైరస్​తో ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా నేడు 3 వందల మందికి పైగా డిశ్చార్జి​ అయినట్లు సమచారం.

తమిళనాడులో కొత్తగా 508 కేసులు

తమిళనాడులో రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 508 మందికి వైరస్ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. వైరస్ బాధితుల సంఖ్య 4,058కి ఎగబాకినట్లు ఆ రాష్ట్ర యంత్రాంగం వెల్లడించింది. మొత్తంగా 33 మంది మహమ్మారికి బలయ్యారు. ఇప్పటి వరకు 1085 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.

గుజరాత్​లో 6 వేలు దాటిన బాధితులు

గుజరాత్​లో కరోనా కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ మరో 441 మందికి వైరస్ పాజిటివ్​గా​ నిర్ధరణ అయింది. మొత్తం బాధితుల సంఖ్య 6,245కు చేరినట్లు అధికారులు తెలిపారు. తాజాగా 49 మంది మృతి చెందగా.. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 368 మంది వైరస్​కు బలయ్యారు. ఇవాళ ఒక్కరోజే 186 మంది డిశ్చార్జి కాగా.. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1381 మందిలో వైరస్ నయమైంది.

దిల్లీలో 5వేలు దాటిన కేసులు

దేశ రాజధాని దిల్లీలో ఇవాళ కొత్తగా 206 మందికి వైరస్​ పాజిటివ్​గా తేలింది. వీటితో కలిపి హస్తినలో మొత్తం కేసుల సంఖ్య 5వేలు దాటాయి.

పంజాబ్​లో 219 మందికి

పంజాబ్​​లో రికార్డు స్థాయిలో 219 వైరస్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 1,451 మంది వైరస్​ బారిన పడినట్లు ఆ రాష్ట్ర అధికారులు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,293 యాక్టివ్​ కేసులు ఉన్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 25 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఉత్తర్​ప్రదేశ్​లో 118 కేసులు

ఉత్తర్​ప్రదేశ్​లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇవాళ మరో 118మంది మహమ్మారి బారినపడ్డారు. 56 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా 2,880 మందికి వైరస్​ సోకినట్లు ఆ రాష్ట్ర అధికారులు ప్రకటించారు. మొత్తంగా 987 మంది డిశ్చార్జి​ అయ్యారు.

బంగాల్​లో ఏడుగురు..

బంగాల్​లో ఇవాళ మరో ఏడుగురు వైరస్​తో మృతి చెందగా.. మొత్తం మరణించిన వారి సంఖ్య 68కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 85 కేసులు నమోదు కాగా... మొత్తంగా 1,344 మంది బాధితులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

రాజస్థాన్​​లో మొత్తం 82 మంది మృతి

రాజస్థాన్​లోనూ కరోనా బాధితులు పెరిగిపోతున్నారు. కొత్తగా 38 వైరస్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 3,099 మంది కరోనా​ బారినపడ్డారు. మరో ఐదుగురు మృతి చెందగా.. మరణాల సంఖ్య 82కు పెరిగింది. 983 మందిలో వైరస్ నయమైంది.

కర్ణాటకలో 28 మంది మృతి..

కర్ణాటకలో ఇవాళ మరో 8 కేసులు మాత్రమే నమోదైనట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా 659 మందికి వైరస్​ సోకినట్లు నిర్ధరణ అయింది. రాష్ట్రవ్యాప్తంగా 28 మంది మృతి చెందగా, 324 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు.

  • హరియాణాలో గడిచిన 24 గంటల్లో 31 మందికి వైరస్​ నిర్ధరణ అయినట్లు అధికారులు తెలిపారు. మొత్తం బాధితుల సంఖ్య 548కి చేరినట్లు వెల్లడించారు.
  • జమ్ముకశ్మీర్​లో మరో 15 మందికి వైరస్​ సోకగా మొత్తం 741 మంది బాధితులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. 320 మంది కోలుకున్నారు.
  • ఝార్ఖండ్​లో నేడు ఏడుగురికి వైరస్ సోకినట్లు ఆ రాష్ట్ర యంత్రాంగం ప్రకటించింది. ఇప్పటి వరకు 122 మందికి వైరస్​ సోకగా.. 27 మంది డిశ్చార్జి​ అయ్యారు.
  • ఒడిశాలో తాజాగా నాలుగు కేసులు మాత్రమే నమోదయ్యాయి. రాష్ట్రంలో వైరస్​ బారిన పడిన వారి సంఖ్య 173కు చేరుకుంది.
  • కేరళలో ఈ రోజు కేవలం మూడు కేసులు మాత్రమే నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం కేసుల సంఖ్య 502కు చేరుకుంది. రాష్ట్రంలో 37 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 21 వేల మంది వైద్య పరిశీలనలో ఉన్నారని సమాచారం.
  • హిమాచల్​ప్రదేశ్​లో గత 12 రోజుల నుంచి ఒక్కరికి కూడా వైరస్​ సోకలేదని ఆ రాష్ట్ర యంత్రాంగం ప్రకటించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 41 కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం ఇద్దరు మాత్రమే చికిత్స పొందుతున్నారు.

Last Updated : May 5, 2020, 9:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.