ETV Bharat / bharat

ఆ ఐదుగురిని భారత్​కు అప్పగించనున్న చైనా - అరుణాచల్​ ప్రదేశ్ సరిహద్దు

అరుణాచల్​ ప్రదేశ్​లో అదృశ్యమైన ఐదుగురు యువకులను భారత్​కు చైనా శనివారం అప్పగించనుందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. సుబాన్​సిరి జిల్లాలో కస్తూరి జింకల వేటకు వెళ్లిన ఐదుగురు యువకులు సెప్టెంబర్​ 4న అదృశ్యమయ్యారు.

Arunachal- China
అరుణాచల్​ ప్రదేశ్​
author img

By

Published : Sep 11, 2020, 10:18 PM IST

చైనా అదుపులోకి తీసుకున్న అరుణాచల్ ప్రదేశ్​ యువకులను శనివారం భారత అధికారులకు అప్పగించే అవకాశం ఉంది. ఈ మేరకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.

"అరుణాచల్​ ప్రదేశ్​కు చెందిన ఐదుగురు తమ వద్దే ఉన్నట్లు చైనా అంగీకరించింది. వారిని సెప్టెంబర్​ 12న ఓ నిర్దిష్ట ప్రదేశంలో భారత అధికారులకు అప్పగించే అవకాశం ఉంది."

-కిరణ్ రిజిజు, కేంద్రమంత్రి

సుబాన్​సిరి జిల్లాలో కస్తూరి జింకల వేటకు వెళ్లిన ఐదుగురు యువకులు సెప్టెంబర్​ 4న అదృశ్యమయ్యారు. వారిని సరిహద్దు సమీపంలో గుర్తించి అదుపులోకి తీసుకన్నట్లు మంగళవారం చైనా ధ్రువీకరించింది.

ఎలా తెలిసింది?

అరుణాచల్​ప్రదేశ్​కు చెందిన ఎంపీ తపీర్​ గావ్​ యువకుల అదృశ్యానికి సంబంధించి విషయం వెల్లడించారు. అంతకుముందు కాంగ్రెస్​ ఎమ్మెల్యే నిన్నాంగ్ ఎరింగ్​ కూడా నాచో గ్రామానికి చెందిన యువకులను చైనా అపహరించిందని ఆరోపించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

నాచో నుంచి రెజంగ్లా కనుమకు వెళ్లే ప్రాంతంలో రెండు రోజులు నడకదారిన వెళ్తే భారత్, చైనా సరిహద్దు మెక్​మోహన్ రేఖ వస్తుంది. ఇక్కడి సమీపంలో భారత భూభాగంలోనే వాళ్లను చైనా సైన్యం అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: 'అవును.. ఆ ఐదుగురు మా దగ్గరే ఉన్నారు: చైనా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.