అయోధ్య వివాదంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సున్నీ వక్ఫ్ బోర్డుకు ప్రత్యామ్నాయ భూమిని ఇచ్చేందుకు ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. అయోధ్యలోని ధన్నీపుర్లో లఖ్నవూ జాతీయ రహదారికి సమీపాన ఐదెకరాల భూమిని ఇవ్వాలని నిర్ణయించింది.
ఈ ప్రతిపాదనకు ఉత్తర్ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
మూడింటిలో ఒకటి..
మొదట కేంద్రానికి 3 ప్రాంతాలను ఎంపిక చేసి పంపింది యూపీ ప్రభుత్వం. వీటిని పరిశీలించి అయోధ్య నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధన్నీపుర్లోని భూమికి కేంద్రం ఆమోదం తెలిపింది. రవాణా వ్యవస్థతో పాటు భద్రత పరంగా అనువైన ప్రదేశం కావటం వల్ల కేంద్రం ధన్నీపుర్ వైపు మొగ్గు చూపింది కేంద్రం.