దేశంలో కరోనా అంతకంతకూ విజృంభిస్తోంది. ముఖ్యంగా తమిళనాడులో వైరస్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది. తాజాగా రికార్డు స్థాయిలో 4,979 కేసులు నమోదయ్యాయి. వీటిలో 1,254 కేసులు చెన్నైలోనే వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,70,693కు చేరింది. తాజాగా మరో 78 మంది కరోనాతో ప్రాణాలు వీడారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,481 మంది మరణించారు. మొత్తం మీద 1,17,915 మంది కరోనాను జయించారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో..
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆదివారం రికార్డు స్థాయిలో 2,211 కేసులు బయటపడ్డాయి. మరో 38మంది వైరస్‌కు బలయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 49,247కు చేరగా.. మరణాల సంఖ్య 1,146కు పెరిగింది.
దిల్లీలో...
దిల్లీలో కొత్తగా 1,211కేసులు నమోదయ్యాయి. మరో 31మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు దేశ రాజధానిలో 1,22,793 వైరస్ కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య 3,628కు చేరింది.
కేరళలో...
కేరళలో తాజాగా 821 కేసులు వెలుగుచూశాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 7,063 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 5,373 మంది వైరస్‌ను జయించారు.
అసోం రాజ్‌భవన్‌లో...
అసోంలో కరోనా వైరస్ తీవ్రత పెరుగుతోంది. ముఖ్యంగా రాష్ట్ర రాజ్‌భవన్‌లో కేసులు సంఖ్య అధికమవుతోంది. శనివారం రాత్రి కొత్తగా 27కేసులు బయటపడగా.. మొత్తం మీద 70 కేసులు నమోదయ్యాయి.
అసోం రాజ్‌భవన్‌ను ఇప్పటికే కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు అధికారులు.
రాష్ట్రం | కొత్త కేసులు | మొత్తం కేసులు |
తమిళనాడు | 4,979 | 1,70,693 |
ఉత్తర్‌ప్రదేశ్ | 2,211 | 49,247 |
బిహార్ | 1412 | 26,379 |
దిల్లీ | 1,211 | 1,22,793 |
పుదుచ్చేరి | 109 | 1,999 |
ఇదీ చూడండి- గుడ్‌న్యూస్: దేశంలో తగ్గుతున్న కరోనా సీఎఫ్ఆర్