'మహా'లో ఒక్కరోజే 6741 మందికి కరోనా.. 213 మరణాలు
మహారాష్ట్ర, తమిళనాడు, దిల్లీ, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మహారాష్ట్రలో కరోనా అంతకంతకూ విస్తరిస్తోంది. కొత్తగా 6,741 మంది కరోనా బారిన పడ్డారు. మరో 213 మంది వైరస్‌తో మృతి చెందారు. ఫలితంగా మొత్తం కేసులు 2,67,665కు పెరిగింది. మరణాల సంఖ్య 10,695కు చేరింది.
తమిళనాడులో వైరస్ బాధితుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. గత 24 గంటల్లో 4,526మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలగా... మరో 67మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,47,324కు పెరిగింది. మరణాల సంఖ్య 2,099కు ఎగబాకింది.
కర్ణాటకలో మరో 2,496 మంది కరోనా బారిన పడగా... 87 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 25,839 చేరగా.. మృతుల సంఖ్య 842కు పెరిగింది.
దేశరాజధానిలో తగ్గుముఖం..
- దిల్లీలో ఒక్కరోజులో 1,606 కేసులు నమోదయ్యాయి. మరో 35 మంది మరణించారు.
- కేరళలో కొత్తగా 608 కేసులు బయటపడ్డాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,930కు ఎగబాకింది.
- పంజాబ్‌లో మరో 340 మంది కరోనా బారిన పడ్డారు. మరో 9 మంది వైరస్‌తో చనిపోయారు.
- ఒడిశాలో ఓ భాజపా ఎమ్మెల్యేకు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధరించారు.