ETV Bharat / bharat

రాజ్యసభలో కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం

రాజ్యసభకు నూతనంగా ఎన్నికైన 45 మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు ఛైర్మన్ వెంకయ్యనాయుడు. సభలో అంతరాయాలకు చోటు లేకుండా సభ్యులంతా నిబంధనలు పాటించి సభాగౌరవాన్ని కాపాడాలని సూచించారు.

author img

By

Published : Jul 22, 2020, 4:10 PM IST

45 newly-elected RS members take oath; Naidu urges them to uphold rules
రాజ్యసభలో నూతన సభ్యులతో ప్రమాణం చేయించిన వెంకయ్య

రాజ్యసభకు ఎన్నికైన నూతన సభ్యులందరూ నిబంధనలు పాటిస్తూ సభాగౌరవాన్ని కాపాడేలా ఉండాలని సూచించారు ఛైర్మన్​ వెంకయ్య నాయుడు. సభా కార్యక్రమాలకు ఆటంకం కల్గించకుండా వ్యవహరించాలన్నారు. పెద్దలసభకు కొత్తగా ఎన్నికైన 45మందితో ప్రమాణ స్వీకారం చేయించారు వెంకయ్య. కరోనా నేపథ్యంలో సభలో భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు.

ప్రమాణ స్వీకారం చేసిన 45మందిలో 36మంది తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. నూతన సభ్యులను త్వరలోనే కమిటీలకు నామినేట్​ చేస్తానని వెంకయ్య చెప్పారు.

కాంగ్రెస్​ నేతలకు సింధియా నమస్కారం..

కాంగ్రెస్​ను వీడి భాజపాలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా... ప్రమాణ స్వీకారానికి ముందు హస్తం పార్టీ సీనియర్ నేతలు దిగ్విజయ సింగ్, గులాంనబీ ఆజాద్​, మల్లికార్జున ఖర్గేలకు నమస్కారాలు తెలిపారు. వారు కూడా సింధియాకు శుభాకాంక్షలు చెప్పారు.

scindhia greets cogress leaders
కాంగ్రెస్​ నేతలకు సింధియా నమస్కారం..

ఇదీ చూడండి: లఖ్​నవూ కాదు.. గురుగ్రామ్​కు ప్రియాంక మకాం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.