బిహార్ పశ్చిమ చంపారన్ జిల్లా బగాహాలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు నక్సల్స్ మృతి చెందారు. సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ), స్పెషల్ టాస్క్ ఫోర్స్.. సంయుక్తంగా కూబింగ్ చేస్తున్న సమయంలో మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులకు పాల్పడ్డారు. దీనితో భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి.
ఘటనాస్థలంలో దొరికిన మూడు సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్ సహా వివిధ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా దళాలు తెలిపాయి.
ఇదీ చూడండి: ప్రమాదంలో పర్యావరణం.. కాగితాల్లోనే నిబంధనలు