మహారాష్ట్రలోని భోర్ఘాట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కరాడ్ నుంచి ముంబయి వెళ్తోన్న ఓ ప్రైవేటు బస్సు తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో భోర్ఘాట్ వద్ద మలుపు తిరిగేటప్పుడు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. 30 మందికి గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసు అధికారులు తక్షణమే సహాయక చర్యలు చేపట్టారు. మృతుల్లో ఓ చిన్నారి, ఇద్దరు మహిళలు ఉన్నట్లు తెలిపారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి : 'మహా' ప్రతిష్టంభన: నేడు దిల్లీకి పవార్, ఫడణవీస్