ETV Bharat / bharat

'3టీ వ్యూహంతోనే వైరస్​పై విజయం'

దిల్లీ, ముంబయి, ఠానే, పుణె, అహ్మదాబాద్​, చెన్నై... ఇలా అన్ని ప్రధాన నగరాల్లోనూ కరోనా విజృంభిస్తోంది. ఆయా నగరాల్లో కేసుల సంఖ్య 11 వేల నుంచి 55 వేల వరకు ఉన్నాయి. కానీ.. దేశంలో మరో మహా నగరమైన బెంగళూరు మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. అక్కడ నమోదైన కేసులు 648 మాత్రమే. ఎందుకింత వ్యత్యాసం? కరోనా కట్టడిలో బెంగళూరు విజయ రహస్యమేంటి?

3T strategy is very essential to grow up from Covid-19
3టీ వ్యూహంతోనే వైరస్​పై విజయం
author img

By

Published : Jun 14, 2020, 4:04 PM IST

Updated : Jun 14, 2020, 4:59 PM IST

దేశవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా మహమ్మారిపై పోరులో కొన్ని రాష్ట్రాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయనే వాదన ఉంది. ముఖ్యంగా విస్తృతస్థాయిలో కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు చేయడంలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా దీనిపై నీతి ఆయోగ్‌ సీఈఓ‌ అమితాబ్‌ కాంత్‌ స్పందించారు. తగినన్ని కరోనా నిర్ధారణ పరీక్షలు జరుపకుండానే కరోనా మహమ్మారి సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చనే ఆలోచనలో కొన్ని రాష్ట్రాలు, పట్టణాలు ఉన్నాయని.. అయితే అది అసాధ్యమని స్పష్టంచేశారు. 3టీ వ్యూహం(టెస్టింగ్‌- ట్రేసింగ్‌- ట్రీట్‌మెంట్‌)తో ముందుకెళ్తున్న కేరళ, కర్ణాటక, దక్షిణ కొరియా ఇదే విషయాన్ని తెలియచెబుతున్నాయని గుర్తుచేశారు. అక్కడి ప్రజలు భౌతిక దూరాన్ని పాటిస్తూ, కచ్చితంగా మాస్కులు ధరించడం వల్లే వైరస్‌ను కట్టడి చేయగలుగుతున్నాయని తెలిపారు అమితాబ్.

3టీ వ్యూహంతో బెంగళూరు ముందుకు..

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న తరుణంలో కర్ణాటకలో వైరస్‌ అదుపులోనే ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 6824 పాజిటివ్‌ కేసులు బయటపడగా 81మంది మృత్యువాతపడ్డారు. ఇక మెట్రో నగరాల్లో ఒకటైన బెంగళూరులో వైరస్‌ వ్యాప్తి తక్కువగానే ఉంది. ఇప్పటివరకు నగరంలో 648కేసులు మాత్రమే నమోదుకాగా 29మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇప్పటివరకు 464మంది కోలుకున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. అయితే, సాంకేతికకు కేంద్ర బిందువైన కర్ణాటక కరోనా వైరస్‌ కట్టడికి 3టీ వ్యూహాన్ని కచ్చితంగా అమలుచేస్తూ ముందుకెళ్తోంది. దీనికి తోడు నాలుగో 'టీ'గా టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రిస్తోంది.

ట్రేసింగ్‌..

వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడంలో ‘ట్రేసింగ్‌’ ఎంతో కీలకమన్న విషయం తెలిసిందే. దీనిలోభాగంగా విదేశాల నుంచి బెంగళూరు చేరుకున్న ప్రతి అంతర్జాతీయ ప్రయాణికులకు స్క్రీనింగ్‌ నిర్వహించారు. అంతేకాకుండా వీరి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులతో కలిపి దాదాపు లక్షా నలభై వేల మందికి స్క్రీనింగ్‌ నిర్వహించారు.

టెస్టింగ్‌..

ఏదైనా ప్రాంతంలో పాజిటివ్‌ కేసు బయటపడిన వెంటనే ఆ ప్రాంతంలో యాదృచ్ఛిక పరీక్షలు నిర్వహించారు. వీటికితోడు ఆ ప్రాంతంలో ప్రతి ఇంటింటికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇదే పద్ధతిని భారీ స్థాయిలో కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఉన్న 71ల్యాబ్‌ల సాయంతో నాలుగు లక్షల కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల నిర్వహించినట్లు కర్ణాటక వైద్యవిద్యాశాఖ మంత్రి సుధాకర్‌ వెల్లడించారు.

ట్రీట్‌మెంట్​..

పాజిటివ్‌ కేసు బయటపడిన వెంటనే బాధితులకి మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారు. ఫలితంగా కరోనా మరణాలను తగ్గించగలుగుతున్నారు. వీటికితోడు క్వారంటైన్‌, చికిత్సకు అవసరమయ్యే అదనపు పడకలను భారీ స్థాయిలో అందుబాటులో ఉంచారు. ఇలా 3టీ వ్యూహాన్ని అమలు చేయడం సహా సాంకేతికను కూడా విస్తృతంగా వినియోగిస్తున్నారు.

  • ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌ ద్వారా వైరస్‌ నిర్ధారణ ఐన వ్యక్తి అంతకుముందు 14రోజులపాటు ఏయే ప్రాంతాల్లో సంచరించారనే సమాచారాన్ని సేకరిస్తున్నారు.
  • ప్రత్యేక మ్యాపుల ద్వారా వైరస్‌ వ్యాప్తిని ఎప్పటికప్పుడు గుర్తిస్తున్నారు.
  • సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తి ప్రతి రెండు గంటలకు ఒకసారి సెల్ఫీ తీసి అప్‌లోడ్‌ చేసే విధానాన్ని అనుసరిస్తున్నారు.
  • వైద్యులకు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ శిక్షణ ఇస్తున్నారు.
  • కృత్రిమ మేధ సహాయంతో ముందుగానే పరిస్థితులను అంచనా వేయగలుగుతున్నారు.

ఇలా అధికారులు 3టీ వ్యూహన్ని అనుసరిస్తూ బెంగళూరులో వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయగలుగుతున్నారు. ఇదిలా ఉంటే, కర్ణాటకలో వైరస్‌ వ్యాప్తి ఆగస్టులో తీవ్రతరమయ్యే అవకాశం ఉందని రాష్ట్ర వైద్యవిద్యాశాఖ మంత్రి కె. సుధాకర్‌ అంచనా వేశారు. దీన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ఇదీ చదవండి: 'దిల్లీలో 2 రోజుల్లో రెట్టింపు పరీక్షలు చేస్తాం'

Last Updated : Jun 14, 2020, 4:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.