ETV Bharat / bharat

ఘనంగా పాసింగ్​ అవుట్​ పరేడ్​- సైన్యంలోకి 333 మంది - Indian military Acadamy

దేహ్రాదూన్​​లోని ఇండియన్​ మిలిటరీ అకాడమీ(ఐఎంఏ)లో సైనికాధికారుల పాసింగ్​ అవుట్​ పరేడ్​ ఘనంగా నిర్వహించారు. ఇందులో 333 మంది భారతీయులు, తొమ్మిది దేశాలకు చెందిన 90 మంది జంటిల్​మన్​ క్యాడెట్స్​ పాల్గొన్నారు. పాసింగ్​ అవుట్​ పరేడ్​లో సైన్యాధిపతి​ నరవాణే పాల్గొని గౌరవవందనం స్వీకరించారు.

IMA POP
ఐఎంఏలో ఘనంగా పాసింగ్​ అవుట్​ పరేడ్​
author img

By

Published : Jun 13, 2020, 8:47 AM IST

Updated : Jun 13, 2020, 9:10 AM IST

ఉత్తరాఖండ్​ దేహ్రాదూన్​​లోని ఇండియన్​ మిలిటరీ అకాడమీ.. తొమ్మిది దశాబ్దాల చరిత్రలో నేడు ఓ కొత్త అధ్యయనం లిఖించింది. 333 మంది భారత సైన్యంలో చేరుతున్న సందర్భంగా పాసింగ్​ అవుట్​ పరేడ్​ను ఘనంగా నిర్వహించారు. కరోనా రక్కసి కాలుదువ్వుతున్నందున కేవలం అధికారులు, సిబ్బంది, ప్రముఖుల సమక్షంలో ఈ పరేడ్​ నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం నిర్వహించాల్సిన పలు కార్యక్రమాలను రద్దు చేశారు. క్యాడెట్ల కుటుంబాలకు ఈసారి ఆహ్వానం అందలేదు. ప్రేక్షకుల ప్రాంతం మొత్తం ఖాళీగా దర్శనమిచ్చింది.

ఘనంగా పాసింగ్​ అవుట్​ పరేడ్

పాసింగ్​ అవుట్​ పరేడ్​లో మొత్తం 423 మంది క్యాడెట్లు పాల్గొన్నారు. ఇందులో 333 మంది భారతీయ జవాన్లు కాగా, తొమ్మిది మిత్రదేశాలకు చెందిన 90 మంది జంటిల్​మన్​ క్యాడెట్స్​ ఉన్నారు.

passing-out-parade
మిలిటరీ అకాడమీ, దేహ్రదూన్​

పరేడ్​లో ఆర్మీ చీఫ్​ జనరల్​ ఎంఎం నరవాణే పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు.

passing-out-parade
గౌరవ వందనం స్వీకరిస్తున్న ఆర్మీ చీఫ్​ నరవాణే

ఎలాంటి సంప్రదాయాలు నిర్వహిస్తారు...

  • ఐఎంఏలో శిక్షణ పూర్తి చేసుకుని సైన్యంలో చేరే క్యాడెట్లకు కుటుంబ సభ్యులు ర్యాంకు బ్యాడ్జీలను అందించటం సంప్రదాయం. కానీ తొలిసారి బంధువులు లేకుండానే ఈ పరేడ్​ నిర్వహిస్తున్నారు.
  • పరేడ్​ సందర్భంగా హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపిస్తారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటారు. కానీ, కరోనా కారణంగా ఈసారి అలాంటి వాటిని రద్దు చేశారు.
  • ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి మెడల్స్​ అందించే కార్యక్రమంలో మార్పులు చేశారు. చేతితో తాకకుండా అందించే ఏర్పాట్లు చేశారు.
    passing-out-parade
    పరేడ్​లో క్యాడెట్లు

ఏ రాష్ట్రం నుంచి ఎంత మంది...

ఈసారి భారత సైన్యంలోకి 333 మంది అధికారులు చేరుతున్నారు. అందులో ఉత్తర్​ప్రదేశ్​-66, హరియాణా-39, ఉత్తరాఖండ్​-31, బిహార్​-31, పంజాబ్​-25, మహారాష్ట్ర-18, హిమాచల్​ప్రదేశ్​-14, జమ్ముకశ్మీర్​-14, రాజస్థాన్​-13, మధ్యప్రదేశ్​-13, కేరళ-8, గుజరాత్​-8, దిల్లీ-7, కర్ణాటక-7, బంగాల్-6, ఆంధ్రప్రదేశ్​-4, ఛత్తీస్​గఢ్​-4, ఝార్ఖండ్​-4, మణిపుర్​-4, చండీగఢ్​-3, అసోం-2, ఒడిశా-2, తమిళనాడు-2, తెలంగాణ-2, మేఘాలయ-2, మిజోరాం-2, లద్దాఖ్​-2.

Last Updated : Jun 13, 2020, 9:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.