చైనా వుహాన్ నుంచి వెనక్కు వచ్చి దిల్లీ ఐటీబీపీ ప్రత్యేక శిబిరంలో వైద్య పరిశీలనలో ఉన్న 406 మందిని డిశ్చార్జి చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇందులో ఇప్పటికే 302 మంది వారి స్వస్థలాలకు బయల్దేరారని ఐటీబీపీ అధికారులు వెల్లడించారు. విమానాశ్రయం, రైల్వే స్టేషన్ వరకు వారికి రవాణా సదుపాయం కల్పించారు ఐటీబీపీ సిబ్బంది. మిగిలినవారు బుధవారం మధ్యాహ్నం లోపు స్వగృహాలకు బయల్దేరతారని అధికారులు వెల్లడించారు.

స్వస్థలాలకు వెళ్లిన అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు పలు సూచనలు చేశారు. మరో 14 రోజులపాటు ఆరోగ్యానికి సంబంధించి స్వీయపరిశీలన చేసుకోవాలని నిర్దేశించారు. కరోనాకు సంబంధించి ఎటువంటి సహకారం అవసరమైనా వెంటనే తమను సంప్రదించవచ్చని చెప్పారు.

ఈ నెల 2న చైనా వుహాన్ నుంచి వచ్చినవారిలో 406మందిని ఐటీబీపీ ప్రత్యేక శిబిరంలో వైద్య పరిశీలనలో ఉంచింది కేంద్రం. తుది పరీక్షల అనంతరం వ్యాధి నిర్ధరణ కాని నేపథ్యంలో వారిని డిశ్ఛార్జి చేశారు.






ఇదీ చూడండి: నమస్తే ట్రంప్: అధ్యక్షుడి పర్యటనకు ఏర్పాట్లు ఇలా...