ETV Bharat / bharat

300వ 'ధృవ్​'ను ఆవిష్కరించిన హెచ్ఏఎల్​ - Dhruv Helicopter news

దేశీయ యుద్ధ హెలికాప్టర్ల ఉత్పత్తికి పేరు గాంచిన హెచ్​ఏఎల్​ నుంచి 300వ హెలికాప్టర్​ ఆవిష్కృతమైంది. మరో 73 హెలికాప్టర్లను భద్రతా దళాల కోసం తయారు చేస్తోంది.

300th ALH-dhruv rolls out from HAL hangar
300వ 'ధృవ్​'ను ఆవిష్కరించిన హెచ్ఏఎల్​
author img

By

Published : Sep 29, 2020, 7:27 PM IST

హిందుస్థాన్​ ఏరోనాటిక్స్​ లిమిటెడ్(హెచ్​ఏఎల్​) నుంచి​ 300వ అడ్వాన్స్​డ్​ లైట్​ హెలికాప్టర్(ఏఎల్​హెచ్​-ధృవ్​) బయటకు వచ్చింది. బెంగళూరు​లోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలో ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.

1992లో తమ మొదటి యుద్ధ హెలికాప్టర్​ నమూనా ఆవిష్కరించినప్పటి నుంచి తాము వెనక్కు తిరిగి చూడలేదని హెచ్​ఏఎల్​ సంస్థ సీఎం​డీ​ ఆర్​ మాధవన్​ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అసమానమైన శక్తి సామర్థ్యాలతో దూసుకెళ్తున్నామని పేర్కొన్నారు.

"ఏఎల్​హెచ్​ మార్క్​-1 నుంచి ఏఎల్​హెచ్​ మార్క్​-4 వరకు మా ప్రస్థానం అసాధారణమైంది. దేశీయంగా హెలికాప్టర్ల అభివృద్ధికి తొలి అడుగు మాతోనే మొదలైంది."

-హిందుస్థాన్​ ఏరోనాటిక్స్​ లిమిటెడ్

2 లక్షల 80 వేల గంటల చరిత్ర..

300వ హెలికాప్టర్​ విడుదల ధ్రువపత్రాన్ని.. డైరెక్టరేట్​ జనరల్​ ఆఫ్​ ఏరోనాటికల్​ క్వాలిటీ అధికారి వై.కె.శర్మ నుంచి హెచ్​ఏఎల్​ సీఈఓ జీవీఎస్​ భాస్కర్​ అందుకున్నారు. 2 లక్షల 80 వేల గంటలపాటు గాలిలో విహరించిన చరిత్ర ఉన్న హెచ్​ఏఎల్​ హెలికాప్టర్లు... అన్నిరకాల మిషన్​లకు అనుకూలమని జీవీఎస్​ భాస్కర్​ అన్నారు. ఏ పరిస్థితుల్లోనైనా, ఏ సమయంలోనైనా పోరాడుతాయని పేర్కొన్నారు.

ప్రస్తుతం హెచ్​ఏఎల్​... 73 హెలికాప్టర్లను ఉత్పత్తి చేస్తోంది. అందులో.. ఆర్మీ-41, నౌకాదళం-16, ఇండియన్​ కోస్ట్​ గార్డ్​-16 హెలికాప్టర్లను వినియోగించనున్నాయి. ఇప్పటికే 38 హెలికాప్టర్లను తయారు చేయగా... మిగిలిన వాటిని 2022 నాటికి పూర్తి చేయనుంది హెచ్​ఏఎల్​.

ఇదీ చూడండి: రూ.30కే వాటర్​ ఫిల్టర్​ను తయారు చేసిన యువకుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.