ETV Bharat / bharat

ఎల్​ఏసీలో పటిష్ఠ భద్రత- కవ్విస్తే చైనా పని అంతే!

వాస్తవాధీన రేఖ వెంబడి చైనా సైన్యానికి దీటుగా భారత్ అన్ని విధాలా సిద్ధమైంది. త్రివిధ దళాల సమన్వయంతో పటిష్ఠమైన ఏర్పాటు చేసింది. చైనా సైన్యం కవ్విస్తే గట్టిబదులు ఇచ్చే విధంగా సైన్యం, ఆయుధాలను మోహరించింది. సరిహద్దులో ప్రస్తుతం ఉన్న రక్షణ వ్యవస్థల వివరాలు ఇలా ఉన్నాయి.

30,000 Indian troops in eyeball-to-eyeball confrontation with Chinese
ఎల్​ఏసీలో పటిష్ఠ భద్రత- కవ్విస్తే చైనా పని అంతే!
author img

By

Published : Jul 7, 2020, 1:15 PM IST

చైనా సైన్యానికి దీటుగా లద్దాఖ్ సరిహద్దులో 30 వేల మంది భారత జవానులు మోహరించినట్లు అధికారులు తెలిపారు. గతనెలలో గల్వాన్​లో హింసాత్మక ఘటన జరిగిన తర్వాత మూడు అదనపు బ్రిగేడ్​లను వాస్తవాధీన రేఖ వద్దకు చేర్చినట్లు వెల్లడించారు.

సాధారణంగా ఈ ప్రాంతంలో ఆరు బ్రిగేడ్​(రెండు డివిజన్లు)లు ఉంటాయి. అయితే గల్వాన్ ఘర్షణ తర్వాత మరో మూడు బ్రిగేడ్​(ఒక్కో బ్రిగేడ్​లో సుమారు 3 వేల మంది సైన్యం)లను వాస్తవాధీన రేఖకు తరలించింది సైన్యం. దాదాపు 10 వేల మంది సైనిక సిబ్బందిని పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర్​ప్రదేశ్​ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చింది. ప్రస్తుతం 14 కార్ప్స్​ కమాండ్ ఆధ్వర్యంలో మూడు ఆర్మీ డివిజన్​లు ఉన్నాయి.

పారా దళాలు

2017 సర్జికల్ స్ట్రైక్స్​లో కీలక పాత్ర పోషించిన ప్రత్యేక పారామిలిటరీ దళాలను సైతం లద్దాఖ్​కు తరలించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.అత్యంత కష్టతరమైన ప్రాంతాల్లో శిక్షణ పొందిన వీరిని సరిహద్దులో మోహరించడం వల్ల సైనిక బలం మరింత పెరుగుతుందని పేర్కొన్నాయి. అదేవిధంగా ఐదు లద్దాఖ్ స్కౌట్స్ బెటాలియన్​లు పర్వత యుద్ధంలో సహాయం కోసం పనిచేస్తున్నట్లు స్పష్టం చేశాయి.

విమానాలు, హెలికాప్టర్లు

అధికారిక వర్గాల ప్రకారం.. వీటితో పాటు ఎం-777 అల్ట్రా-లైట్ హవిట్జర్ ఆర్టిలరీ ఫిరంగులు, హెలికాఫ్టర్లు సరిహద్దులో ఆర్మీ వెంట ఉన్నాయి. సైన్యం, యుద్ధ వాహనాలు, టీ-72, టీ-90 వంటి భారీ ట్యాంకులను తరలించడానికి ఎయిర్​ఫోర్స్​కు చెందిన సీ-17 గ్లోబ్​మాస్టర్-3 రవాణా విమానాన్ని ఉపయోగిస్తోంది.

సుఖోయ్-30 ఫైటర్స్, మిగ్-29 జెట్ విమానాలు, ఇలియుషిన్-76 హెవీ లిఫ్ట్ విమానాలు, ఏఎన్-32 రవాణా విమానాలు, ఎంఐ-17 హెలికాఫ్టర్లు, బీఎంపీ-2/2కే వాహనాలు సైన్యం వద్ద అందుబాటులో ఉన్నాయి.

ఆకాష్ క్షిపణి

దౌలత్ బేగ్ ఓల్డీ వంటి ఆర్మీ ఫార్వడ్ డిప్లాయ్​మెంట్లకు మద్దతుగా సీ-130జే సూపర్ హెర్క్యులస్ విమానాలు సిద్ధంగా ఉన్నాయి. పెట్రోలింగ్​ కోసం ఉపయోగించే నేవీ పీ81 ఎయిర్​క్రాఫ్ట్​ను లద్దాఖ్​లోని ఎత్తైన ప్రదేశాల్లో మోహరించారు. స్వదేశీ ఆకాష్ క్షిపణి వ్యవస్థను సైతం సరిహద్దులో ఏర్పాటు చేశారు.

లద్దాఖ్​లో ఈ మోహరింపుల పట్ల ఆర్మీ అధికారులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. చైనా నుంచి కవ్వింపులు మొదలైతే ప్రతీకార చర్యలు అత్యంత తీవ్రంగా ఉంటుందని స్పష్టం చేశాయి.

ఇదీ చదవండి- సరిహద్దులో భద్రత కట్టుదిట్టం.. రాత్రి వేళ హెలికాప్టర్ల గస్తీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.