ప్రతి ఏడాది 'ఛట్' పూజ సందర్భంగా భక్తి పారవశ్యంతో నిండిపోయే బిహార్లో ఈ సారి పెను విషాదం చోటుచేసుకుంది. నీట మునగటం, తొక్కిసలాట, గోడ కూలడం వంటి ఘటనల్లో బిహార్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో 18 మంది చిన్నారులు సహా 30 మంది ప్రాణాలు కోల్పోయారు.
సమస్తీపుర్ జిల్లా బద్‌గావ్ గ్రామంలో ఛట్ పూజ నిర్వహిస్తుండగా గోడ కూలి ఇద్దరు మహిళలు చనిపోయారు. ఔరంగబాద్ జిల్లా సూర్యకుండ్ వద్దకు ఛట్ పూజల కోసం భారీ సంఖ్యలో భక్తులు రాగా.. తొక్కిసలాట జరిగి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. వందలాది మంది క్షతగాత్రులయ్యారు. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
ఖగారియా, విశాలీ, పూర్ణియా జిల్లాల్లో కూడా నీట మునిగి పలువురు ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి : ఎన్ఆర్సీ అత్యవసరం-భవిష్యత్తుకు ఆధారం: సీజేఐ