భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఝార్ఖండ్ గిరీడీ జిల్లా బెల్భాఘాట్ అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు సహా ఓ సీఆర్పీఎఫ్ జవాను ప్రాణాలు కోల్పోయారు.
బెల్భా అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ 7వ బెటాలియన్ ఉదయం కూంబింగ్‌కు వెళ్లింది. ఉదయం 6గంటల సమయంలో వారిపై నక్సలైట్లు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిని భద్రతా సిబ్బంది దీటుగా తిప్పికొట్టారు.
ఘటనాస్థలి నుంచి ఒక ఏకే-47 రైఫెల్, తూటాలు, 4 పైపు బాంబులు స్వాధీనం చేసుకున్నాయి భద్రతా బలగాలు. ఎన్కౌంటర్ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి.
7 విడతల సార్వత్రిక ఎన్నికల్లో చివరి 4 విడతల్లో ఝార్ఖండ్‌లో పోలింగ్ జరగనుంది.
- ఇదీ చూడండి: ముంబయిలో భవనం కూలి ఒకరు మృతి