ETV Bharat / bharat

రాజధానిలో భూకంపం.. ఉలిక్కిపడ్డ జనం - delhi lockdown

దిల్లీలో రిక్టర్​స్కేలు​పై 3.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూ ప్రకంపనల ధాటికి లాక్​డౌన్​ వేళ ప్రాణభయంతో వీధుల్లోకి పరుగులు తీశారు జనం.

రాజధానిలో భూకంపం.. ఉలిక్కిపడ్డ జనం
3.5-magnitude earthquake hits Delhi, tremors felt across NCR
author img

By

Published : Apr 12, 2020, 10:14 PM IST

దేశ రాజధానిలో స్వల్పంగా భూమి కంపించింది. రిక్టర్‌స్కేలుపై దాని తీవ్రత 3.5గా నమోదైంది. ఆదివారం సాయంత్రం 5.45 గంటల ప్రాంతంలో కొన్ని సెకన్ల పాటు ఈ ప్రకంపనలు సంభవించాయి.

రాజధాని ప్రాంతంతో పాటు నోయిడా, గాజియాబాద్, ఫరీదాబాద్​లలో భూమి కంపించింది. సుమారు 8 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అధికార వర్గాలు తెలిపాయి. లాక్‌డౌన్‌ వేళ ప్రజలంతా ఇళ్లకే పరిమితమైన నేపథ్యంలో.. ప్రకంపనలు సంభవించడం వల్ల అందరూ బయటకు పరుగులు తీశారు.

సీఎం స్పందన..

భూప్రకంపనలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పందించారు. "ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నా.. ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తున్నా" అని ట్వీట్‌ చేశారు.

ఇదీ చదవండి: దోస్త్​ను సూట్​కేస్​లో కుక్కి ఫ్లాట్​లోకి గప్​చుప్​గా...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.