ETV Bharat / bharat

ఒకే కుటుంబంలోని 23 మందికి కరోనా - covid news in india

దేశంలో కరోనా కేసులు రోజూ రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఎక్కువగా విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారానే భారత్​లో వైరస్​ సంక్రమించింది. బిహార్​లోనూ ఇదే పునరావృతమైంది. ఒమన్​ నుంచి వచ్చిన ఒకే వ్యక్తి ద్వారా.. అతని కుటుంబంలోని మరో 23 మంది కరోనా బారినపడ్డారు. ఈ వార్త రాష్ట్రంలో సంచలనంగా మారింది.

29 corona patients in Siwan, 23 of same family infected
ఒమన్​ నుంచి ఒకే కుటుంబంలోని 23 మందికి కరోనా!
author img

By

Published : Apr 11, 2020, 9:02 PM IST

Updated : Apr 11, 2020, 10:04 PM IST

భారత్​లో కరోనా కోరలు చాస్తోంది. బిహార్​లో ఇప్పటివరకు 60 కేసులు నమోదుకాగా.. ఒక్క సివాన్​ జిల్లాలోనే బాధితుల సంఖ్య 29గా ఉంది. ఇందులో ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. ఒకే కుటుంబంలోని 23 మంది ఇక్కడ కరోనా బారినపడ్డారు.

ఒమన్​ నుంచి ఒక వ్యక్తి సివాన్​కు వచ్చిన తర్వాత.. ఈ ప్రాంతం కరోనాకు హాట్​స్పాట్​గా మారింది. ఆ వ్యక్తి సివాన్​కు వచ్చాక పరీక్షలు నిర్వహిస్తే కరోనా పాజిటివ్​గా తేలింది. అతని నుంచి కుటుంబంలోని మొత్తం 23 మందికి కరోనా సోకినట్లు అధికారులు ధ్రువీకరించారు. ఇందులో 9 నుంచి 20 ఏళ్లలోపు నలుగురు అమ్మాయిలు, 50 ఏళ్లు పైబడిన ముగ్గురు మహిళలు ఉన్నారు. మిగతా వారు పురుషులు.

అధికారులు అప్రమత్తం..

ఒకేసారి ఇన్నికేసులు బయటపడ్డాక... అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సివాన్​లో పరిస్థితిని క్షణక్షణం పర్యవేక్షిస్తున్నారు. బాధితులందరికీ మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు జిల్లా సమాచార, ప్రజా సంబంధాల అధికారి. మరో 119 మందిని క్వారంటైన్​లో ఉంచినట్లు స్పష్టం చేశారు.

ఇంకా ఎందరికి?

ఒమన్​ నుంచి వచ్చిన వ్యక్తి.. దిల్లీ, పట్నా మీదుగా ప్రయాణించినట్లు తెలుస్తోంది. అయితే.. పట్నా నుంచి సివాన్​కు ఎలా చేరుకున్నాడనేది స్పష్టత లేదు. బాధితునితో సన్నిహితంగా ఉన్న అందరూ స్వచ్ఛందంగా వచ్చి టెస్టులు చేయించుకోవాలని కోరుతున్నారు అధికారులు.

ఒమన్​ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా ఎలా సోకిందో ఇంకా తెలియలేదని.. డాక్టర్​ రాజ్​కిషోర్​ చౌదరి పేర్కొన్నారు. ఆ వ్యక్తి.. పట్నా నుంచి బస్​స్టాండ్​కు ఏ ఆటోలో వెళ్లాడో, ఎంత మందికి సన్నిహితంగా ఉన్నాడో సరైన వివరాలు చెప్పలేకపోతున్నాడని అన్నారు.

Last Updated : Apr 11, 2020, 10:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.