సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని 70 ప్రముఖ సంస్థలు, ప్రయోగశాలల్లో 2,896 శాస్త్రవేత్తల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ విషయాన్ని ఆ శాఖ మంత్రి హర్షవర్ధన్ లోక్సభకు అందించిన లిఖితపూర్వ సమాధానంలో వెల్లడించారు.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫి- గోవా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ- హైదరాబాద్, నేషనల్ కెమికల్ లేబొరేటరీ-పుణె, ఫోర్త్ పారడిమ్ ఇన్స్టిట్యూట్- బెంగళూరు, సెంట్రల్ ఫ్లడ్ టెక్నాలజికల్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్- మైసూరు వంటి ప్రముఖ సంస్థల్లో 100కుపైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు హర్షవర్ధన్ తెలిపారు.
సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖలో 3 విభాగాలు (కౌన్సిస్ ఫర్ సైన్స్ అండ్ ఇండస్ట్రియల్ రీసర్చ్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ) ఉన్నాయి.
ఇదీ చూడండి:- ముహూర్తం కోసం నీళ్ల రైలుకు రెడ్ సిగ్నల్!