ETV Bharat / bharat

సాయం చేసిన ఆ 26 మందికి కరోనా - Malappuram SP has tested for corona virus

కోజికోడ్​ విమాన ప్రమాద ఘటనలో సహాయక చర్యలు చేపట్టిన 26 మందికి కరోనా సోకింది. వారికి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

26 who helped passengers of crashed plane contract COVID-19
సాయం చేసిన ఆ 26 మందికి కరోనా
author img

By

Published : Aug 20, 2020, 5:24 PM IST

Updated : Aug 20, 2020, 5:44 PM IST

ఇటీవల జరిగిన కోజికోడ్​ విమాన ప్రమాద ఘటనలో సహాయక చర్యలు చేపట్టిన 26 మంది వలంటీర్లకు కరోనా పాజిటివ్​గా తేలింది. వీరిలో స్థానిక జిల్లా కలెక్టర్​, ఎస్పీ సహా ఇతర అధికారులు కూడా ఉన్నారు.

ఆగస్టు 7న కేరళలోని కోజికోడ్​లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు అందించారు. భారీ వర్షాన్ని లెక్కచేయకుండా క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడంలో కీలక పాత్ర పోషించారు.

ఈ ఘటనలో జిల్లా కలెక్టర్​ కె. గోపాలకృష్ణన్, ఎస్పీ అబ్దుల్​ కరీమ్​ సహా మొత్తం 21 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొనగా.. వారందరికీ కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. వీరందరినీ వైద్య పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: కేంద్ర జల్​ శక్తి మంత్రికి కరోనా పాజిటివ్​

Last Updated : Aug 20, 2020, 5:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.