ETV Bharat / bharat

కదిలే బస్సులో యువతిపై అత్యాచారం - Running Private Bus In Washim

మహారాష్ట్ర వాషిమ్​లో ఇటీవల జరిగిన 'నిర్భయ' తరహా ఘటన.. ఆలస్యంగా బయటపడింది. వాషిమ్​ నుంచి పుణెకు వెళ్తున్న బస్సులో ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడో వ్యక్తి.

24-year-old girl rape in a running private bus in Washim in Maharashtra
కదిలే బస్సులో 24ఏళ్ల యువతిపై అత్యాచారం
author img

By

Published : Jan 11, 2021, 6:03 PM IST

మహారాష్ట్రలోని వాషిమ్​లో 'నిర్భయ' తరహా ఘటన జరిగింది. 24 ఏళ్ల ఓ యువతిపై కదిలే​ బస్సులో అత్యాచారానికి పాల్పడ్డాడో వ్యక్తి. వాషిమ్​ నుంచి గోండియాకు వెళ్తున్న ఓ ప్రైవేట్​ బస్సులో ఈ దుర్ఘటన జరిగింది. ఈ నెల 6న జరిగిన ఈ ఘటన.. బాధితురాలి ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇదీ జరిగింది..

గోండియా జిల్లాకు చెందిన బాధితురాలు.. ఓ పనిమీద పుణెకు వెళ్తుండగా.. మాలెగావ్​ ప్రాంతంలో ఆమెపై అత్యాచారం చేశాడో దుండగుడు. అనంతరం ఆమెను చంపేస్తానని కత్తితో బెదిరించాడు. బాధితురాలు.. పుణె చేరుకున్నాక స్థానిక పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనకు సంబంధించి.. పుణెకు చెందిన గుడ్​విల్​ ట్రావెల్స్​, ప్రధాన నిందితుడు సమీర్​ దివాకర్​పై కేసు నమోదైంది. మాలెగావ్​ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న సమీర్​ కోసం.. ఓ ప్రత్యేక బృందంతో గాలింపు చర్యలు చేపట్టినట్టు సమాచారం.

ఇదీ చదవండి: ఉద్యోగం నుంచి తీసేశారని ఆటోలో ఆత్మాహుతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.