ETV Bharat / bharat

నదిలో పడిన పెళ్లి బస్సు- 24 మంది మృతి - రాజస్థాన్​

రాజస్థాన్​లోని కోటా- దౌసా హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. బుందీ సమీపంలో అదుపు తప్పిన ఓ ప్రైవేట్​ బస్సు.. వంతెనపై నుంచి నదిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 24 మంది మరణించారు.

accident
ప్రమాదం
author img

By

Published : Feb 26, 2020, 1:03 PM IST

Updated : Mar 2, 2020, 3:17 PM IST

నదిలో పడిన పెళ్లి బస్సు

రాజస్థాన్​ బుందీ జిల్లాలో ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి మేజ్​ నదిలోకి దూసుకెళ్లింది. కోటా- దౌసా హైవేపై జరిగిన ఈ ప్రమాదంలో 24 మంది మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు.

ఘటనాస్థలానికి హుటాహుటిన చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

డ్రైవర్​ నిర్లక్ష్యమే!

28 మందితో కూడిన పెళ్లి బృందంతో బస్సు కోటా నుంచి సవాయి మాదాపుర్ వెళుతుండగా.. పాప్డి సమీపంలోని వంతెనపై ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్​ నిద్రపోవటం కారణంగా బస్సు అదుపుతప్పి వంతెన ప్రహరీని ఢీకొట్టి నదిలోకి దూసుకుపోయింది.

10 మంది మహిళలు..

ఈ ఘటనలో 13 మంది అక్కడికక్కడే చనిపోగా.. 11 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. వీరిలో 10 మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఇందులో చాలామందిని స్థానికులే ఆసుపత్రికి తరలించారు.

Last Updated : Mar 2, 2020, 3:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.