ETV Bharat / bharat

ఆపరేషన్​ నిజాముద్దీన్​: ఆ 157 మంది ఎక్కడ?

దిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నవారిలో మరో 24మందికి కరోనా సోకినట్లు తేలింది. మర్కజ్​లో మిగిలిపోయిన వారిలో 335 మందిని ఆసుపత్రులకు, 700 మందిని నిర్బంధ కేంద్రాలకు తరలించారు. ఇప్పటికే స్వస్థలాలకు వెళ్లిన 1500 మందిని గుర్తించేందుకు కృషిచేస్తున్నారు. ప్రార్థనలు వెళ్లి వచ్చిన 157 మంది ఆచూకీ కనిపెట్టేందుకు యూపీ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

virus.. nizamuddin
దిల్లీ ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో మరికొందరికి వైరస్
author img

By

Published : Mar 31, 2020, 1:29 PM IST

దిల్లీ హజ్రత్​ నిజాముద్దీన్​ మత ప్రార్థనల్లో పాల్గొన్నవారిలో మరో 24 మందికి కరోనా సోకినట్లు తేలిందని చెప్పారు దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్. మర్కజ్​ భవనంలో మిగిలిపోయిన వారిలో 335 మందిని ఆసుపత్రులకు తరలించినట్లు తెలిపారు. 700 మందిని నిర్బంధ కేంద్రాల్లో వైద్య పరిశీలనలో ఉంచినట్లు స్పష్టం చేశారు.

మర్కజ్ భవనం ప్రాంతాన్ని డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు అధికారులు. ఇప్పటికే 1500మంది స్వస్థలాలకు వెళ్లిన నేపథ్యంలో వారిని గుర్తించే దిశగా కృషిచేస్తున్నారు.

ఉత్తర్​ప్రదేశ్​లో వెతుకులాట..

నిజాముద్దీన్ వ్యవహారంపై ఉత్తర్​ప్రదేశ్ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రార్థనల్లో పాల్గొని రాష్ట్రానికి చేరుకున్న 157 మంది కోసం వెతుకుతున్నారు అక్కడి అధికారులు.

బ్లాక్​లిస్ట్​లో 300మంది..

నిజాముద్దీన్ మర్కజ్​లో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనేందుకు మలేసియా, థాయ్​లాండ్ సహా 16 దేశాల నుంచి వచ్చిన 300మంది పర్యటకులను భారత్​ బ్లాక్​లిస్టులో చేర్చే అవకాశం ఉందని సమాచారం. దేశంలో వైరస్​ వ్యాప్తికి కారణమైన నేపథ్యంలో వీసా నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ వీరిపై చర్యలు తీసుకోనున్నారు. మర్కజ్​ భవనం నుంచి ఇప్పటికే 281మంది విదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా పర్యటక వీసాలపై దేశంలోకి ప్రవేశించినట్లు సమాచారం.

ఇదీ జరిగింది..

దిల్లీ హజ్రత్​ నిజాముద్దీన్ ప్రాంతం మర్కజ్​ భవనంలో జనతా కర్ఫ్యూనకు ముందు 'తబ్లీగ్-ఎ-జమాత్'​ పేరుతో కొద్ది రోజుల పాటు మత ప్రార్థనలు జరిగాయి. 23వ తేదీన 1500మంది స్వస్థలాలకు వెళ్లిపోయారు. మరో 1000మంది మర్కజ్​లో ఉండిపోయారు. అయితే ఈ ప్రార్థనల్లో పాల్గొన్నవారిలో 10మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. పలువురికి వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది.

ఇదీ చూడండి: 'ప్రపంచమంతా మాంద్యం వచ్చినా భారత్​ సేఫ్​!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.