ETV Bharat / bharat

హరియాణాలో పార్టీల ఓట్ల శాతాల్లో భారీ తేడాలు

హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు షాక్​ తగిలింది. 2014తో పోల్చుకుంటే 3 శాతం ఓటింగ్ పెరిగినప్పటికీ.. సీట్ల సంఖ్య మాత్రం తగ్గింది. ఈ ఏడాది జరిగిన లోక్​సభ ఎన్నికలతో పోల్చితే మాత్రం భాజపా ఓట్లకు భారీగా గండిపడింది. మరోవైపు కాంగ్రెస్ అంచనాలకు మించి రాణించి 28.10శాతం ఓట్లతో 31 స్థానాలు కైవసం చేసుకుంది.

హరియాణాలో అన్ని పార్టీల ఓట్ల శాతాల్లో భారీ తేడాలు
author img

By

Published : Oct 25, 2019, 5:22 AM IST

హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భాజపాకు మిశ్రమ ఫలితాలు దక్కాయి. ఈసారి సీట్ల సంఖ్య తగ్గినప్పటికీ.. 2014తో పోల్చుకుంటే 3 శాతం ఓటింగ్ పెరిగింది. అయితే లోక్​సభ ఎన్నికలను పరిగణనలోకి తీసుకుంటే కాషాయ పార్టీకి పోలైన ఓట్ల శాతం భారీగా తగ్గింది.

పార్లమెంట్ ఎన్నికల్లో... హరియాణాలోని 79 అసెంబ్లీ సెగ్మెంటుల్లో భాజపా 58.2 శాతం ఓట్లు సాధించి ఆధిక్యంలో నిలిచింది. దీనితో పోల్చుకుంటే.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 36.48 శాతం ఓట్లతో 40 అసెంబ్లీ సీట్లు మాత్రమే సాధించగలిగింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 33.20 శాతం ఓట్లతో 47 సీట్లు సాధించి అధికారం కైవసం చేసుకోవడం గమనార్హం.

అంచనాలను మించిన కాంగ్రెస్

2014 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే కాంగ్రెస్ బాగా పుంజుకుంది. 2014లో 20.58 శాతం ఓటింగ్​తో 15 సీట్లకే పరిమితమైన హస్తం పార్టీ.. ఈసారి 28.10 శాతం ఓట్లు సాధించి 31 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది.

2019లో జరిగిన లోక్​సభ ఎన్నికల్లో... హరియాణాలో కాంగ్రెస్ కేవలం 28.42 శాతం ఓట్లతో కనీసం ఖాతా తెరవలేకపోయింది. భాజపా మొత్తం 10 స్థానాలను కైవసం చేసుకుని ఘన విజయం సాధించింది. దీన్ని పరిశీలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అంచనాలకు మించి రాణించింది.

కింగ్​ మేకర్ దుష్యంత్​

దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జననాయక్​ జనతాపార్టీ, స్వతంత్రులు, ఇతరులు కలిసి 27.33 శాతం ఓట్లు సాధించారు.

రాష్ట్రంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడం వల్ల దుష్యంత్ కింగ్​మేకర్​గా నిలిచారు. ఆయన మద్దతు కోసం భాజపా, కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నాయి.

24 నుంచి 2 శాతానికి పడిపోయిన ఐఎన్ఎల్​డీ

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియన్​ నేషనల్​ లోక్​దళ్ భారీగా నష్టపోయింది. 2014లో 24.11 శాతం ఓట్లు సాధించిన ఆ పార్టీకి... ఈసారి 2.45 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆ పార్టీ నాయకుడు అభయ్​ చౌతాలా మాత్రమే ఎల్లెనాబాద్​ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.

లెక్కలోకి రాని పార్టీలు

ఐఎన్​ఎల్​డీ మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్ కేవలం 0.38 శాతం ఓట్లు మాత్రమే సాధించగలిగింది. 87 స్థానాల్లో పోటీచేసిన బహుజన్ సమాజ్​ పార్టీ 4.11 శాతం ఓట్లు సాధించి.. ఒక్క సీటూ గెలువలేకపోయింది.

హరియాణాలో తొలిసారి పోటీపడిన ఆమ్​ ఆద్మీ పార్టీకి చేదు అనుభవం మిగిలింది. కేవలం 0.48 శాతం ఓట్లు మాత్రమే ఆ పార్టీకి పోలయ్యాయి.

ఇదీ చూడండి: 'మహా'లో మళ్లీ భాజపా-సేనదే అధికారం- పీఠం చెరిసగం!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Beirut - 24 October 2019
++ NIGHT SHOTS++
1.Various of protesters blocking the streets at night in Beirut
STORYLINE:
Protests continued in Beirut on Thursday, as demonstrators rebuked the Lebanese president's latest overtures and calls for dialogue.
Michael Aoun pleaded with tens of thousands of protesters who have blocked main roads and paralysed the nation for days, urging them to back economic reforms proposed by the prime minister as the "first step" toward saving the country from economic collapse.
The protesters have already rejected the initiative as empty promises.
Protesters played music as they danced and waved Lebanon's flag, as they blocked the streets in defiance.
As the protests entered their second week with banks, schools and public institutions shuttered, the country appeared headed for a protracted crisis with no clear roadmap for a solution.
Lebanon has been engulfed by protests since last Thursday, a paralysis that has compounded the country's severe economic crisis and is threatening to plunge it into another cycle of chaos and instability.
The protests were triggered by new proposed taxes and have escalated into a nationwide revolt against the country's sectarian-based leaders, who have ruled the country since the end of Lebanon's 1975-90 civil war, amassing wealth even as the country gets poorer.
Corruption and mismanagement have been widespread.
Hundreds of thousands of people have flooded public squares across the country in the largest protests in over 15 years - a rare show of unity among Lebanon's often-divided public in their revolt against status-quo leaders who have ruled for decades and brought the economy to the brink of disaster.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.