ETV Bharat / bharat

దిల్లీలో వచ్చే వారం నాటికి 20,000 'కరోనా' పడకలు! - దిల్లీలో కరోనా రోగుల కోసం 20 వేల పడకలు

కరోనా ధాటికి అతలాకుతలమవుతున్న దిల్లీలో... వచ్చే వారం నాటికి 20,000 పడకలు సిద్ధంగా ఉంచుతామని కేంద్ర హోంమంత్రి అమిత్​షా పేర్కొన్నారు. అలాగే దిల్లీలోని రాధాస్వామి బియాస్ వద్ద ఏర్పాటుచేసిన 10,000 పడకల సంరక్షణ కేంద్రం జూన్​ 26 నుంచి అందుబాటులోకి తెస్తున్నట్లు స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్... క్లిష్ట సమయంలో ఆదుకున్న అమిత్​ షాకు కృతజ్ఞతలు తెలిపారు.

20,000 beds for COVID-19 patients in Delhi by next week: Shah
దిల్లీలో వచ్చే వారం నాటికి 20,000 'కరోనా' పడకలు!
author img

By

Published : Jun 24, 2020, 4:49 AM IST

వచ్చే వారం నాటికి దిల్లీలో కొవిడ్​ రోగుల కోసం 20,000 పడకలు సిద్ధంగా ఉంటాయని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా పేర్కొన్నారు. ఇప్పటికే దిల్లీలోని కొవిడ్​ కేర్​ సెంటర్లలో 8,000 అదనపు పడకలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

" ప్రియమైన కేజ్రీవాల్​ జీ, దిల్లీలోని రాధాస్వామి బియాస్ వద్ద ఏర్పాటుచేసిన 10,000 పడకల సంరక్షణ కేంద్రం జూన్​ 26 నుంచి అందుబాటులోకి వస్తుంది. దీని నిర్వహణను ఐటీబీపీకి అప్పగించాం. అలాగే వచ్చే వారం నాటికి కరోనా రోగుల కోసం 20,000 పడకలు సిద్ధం చేస్తాం."

- అమిత్​ షా ట్వీట్

10,000 పడకల కేంద్రాన్ని పరిశీలించి, కరోనా రోగుల చికిత్స కోసం ఐటీబీపీ, ఆర్మీకి చెందిన వైద్యులు, నర్సులను ఏర్పాటుచేయాలని ఇంతకు ముందు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. అమిత్​షాకు లేఖ రాశారు. దీనికి సమాధానంగానే అమిత్​షా తాజా ట్వీట్ చేశారు.

అమిత్​ షా... 250 ఐసీయూ పడకలతో సహా 1000 పడకల పూర్తి స్థాయి ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్నామని; డీఆర్​డీఓ, టాటా ట్రస్ట్ సంయుక్తంగా దీని ఏర్పాటుకు కృషి చేస్తున్నాయని... మరో 10 రోజుల్లో ఇది అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఈ ఆసుపత్రిని సాయుధ దళాల సిబ్బంది నిర్వహిస్తారని అమిత్ షా స్పష్టం చేశారు.

20,000 beds for COVID-19 patients in Delhi by next week: Shah
వచ్చే వారం నాటికి 20,000 పడకలు సిద్ధంగా ఉంచుతాం: అమిత్​ షా

రైల్వే కోచ్​ల్లో ఏర్పాటుచేసిన కొవిడ్ కేంద్రాల్లోనూ... సాయుధ దళాలకు చెందిన ఆరోగ్య సిబ్బంది వైద్య సేవలు అందిస్తారని అమిత్​షా వెల్లడించారు.

ధన్యవాదాలు

అమిత్​ షా ట్వీట్లపై దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సానుకూలంగా స్పందించారు. క్లిష్టసమయంలో ఆప్ ప్రభుత్వానికి, దిల్లీ ప్రజలకు సాయం చేసిన అమిత్​ షాకు కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు.

దిల్లీ కోసం భద్రతా దళాలు, సామాజిక సంస్థలు, కేంద్ర ప్రభుత్వం, దిల్లీ సర్కార్​ అన్నీ ఐక్యంగా పనిచేస్తున్నాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇదే విధంగా ముందుకు సాగితే కచ్చితంగా కరోనాను నియంత్రించగలమనే విశ్వాసం తనకుందన్నారు.

ఇదీ చూడండి: దేశ రాజధానిలో పట్టుబడ్డ రూ.40 కోట్ల హెరాయిన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.