జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తోన్న ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతోంది భారత సైన్యం. తాజాగా రాజౌరీ జిల్లాలోని ఎల్ఓసీ వెంబడి దేశంలోకి ప్రవేశించేందుకు చేసిన ప్రయత్నాన్ని భగ్నం చేశాయి బలగాలు. ఇద్దరు ముష్కరులను హతమార్చాయి.
" రాజౌరీ జిల్లా నౌషహరా సెక్టార్లో కొంత మంది ఉగ్రవాదుల బృందం భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించిన భారత బలగాలు కాల్పులు జరిపాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులూ కాల్పులకు పాల్పడ్డారు. ఆ ప్రాంతంలో ఓ పేలుడు సంభవించింది. ల్యాండ్‌మైన్‌పై అందులో ఒకరు కాలుపెట్టడం వల్ల జరిగి ఉండొచ్చు. ఈ ఘటనలో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనాస్థలం నుంచి మృతదేహాలను తీసుకురావాల్సి ఉంది. కొంత మంది వెనక్కి పారిపోయారు."
- అధికారులు.
చొరబాట్ల నేపథ్యంలో ఎల్ఓసీ వెంబడి తనిఖీలు ముమ్మరం చేసినట్లు చెప్పారు అధికారులు.
గత నెల జూన్ 1న ఇలాగే అక్రమ చొరబాట్ల ప్రయత్నాలను భగ్నం చేశాయి బలగాలు. ఆ ఘటనలో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు.
ఇదీ చూడండి: చొరబాటు భగ్నం- ముగ్గురు ఉగ్రవాదులు హతం